– బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్
నవతెలంగాణ – కంటేశ్వర్
భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక భద్రత, సంక్షేమం, రిజర్వేషన్లను, విద్యా, వైద్యం, ఉపాధి కల్పన తదితర మౌలిక సదుపాయాలను అమలు చేయడంలో వైఫల్యం చెందాయని దండి వెంకట్ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్ పీ నిజామాబాద్ అర్బన్ కమిటి సమావేశం అర్బన్ కమిటి అద్యక్షులు ఎం.అజయ్ అద్యక్షతన సంజీవయ్య కాలనిలో గల గౌడ్ సంఘంలో జరిగింది. ఈ సమావేశంలో బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ మాట్లాడుతూ..మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు మద్యం, డబ్బులు పెంచకుండా ఓట్లు అడిగే దుమ్ములేదని విమర్శించారు. ప్రజల ఆర్థిక బలహీనతలను ఆసరాగా చేసుకొని ఎన్నికల్లో మధ్యం, డబ్బులు పంచి భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ ఓటు హక్కును కాలరాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బహుజన వామపక్ష పార్టీలకు ఓటు వేసి బలపర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, జిల్లా అధ్యక్షురాలు గీతాంజలి ప్రధాన కార్యదర్శి దండు జ్యోతి, పార్టీ నగర నాయకులు టి, రాజు, అక్బర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.