మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేయర్ దండు నీతుకిరన్  నగర అధ్యక్షుడు సిర్పరాజు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నగరంలోని మారుతి నగర్ స్నేహ సొసైటీ లో మానసిక వికలాంగుల మధ్య మాజీ శాసనసభ్యులు గణేష్ బీగాల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సీనియర్ నాయకులు బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు సుజిత్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు సిర్ప రాజు, నాయకులు సుజీత్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ..70 ఏళ్ల చరిత్రలో నిజామాబాద్ దిశా దశలు మార్చి మిస్టర్ డెవలప్మెంట్ అని పేరు తెచ్చుకున్న మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది అన్నారు. నగర సుందరీకరణలో ఎంతో ఎనలేని కృషిచేసి రాత్రింబవళ్లు కష్టపడి నిజామాబాద్ హైదరాబాద్ తో పోటీపడేలా చేసిన ఘనత గణేష్ బిగాల కి దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు ఫయాజుద్దీన్,సుదాం రవిచందర్, పార్టీ అర్బన్ జనరల్ సెక్రటరీ ఎనగందుల మురళి, ధర్మపురి,గాండ్ల లింగం బిల్లా మహేష్,సత్యపాల్, చింతకాయల రాజుయెండల ప్రసాద్,కరిపే రాజు,శంకర్  మెతుకు శివకుమార్, అమర్, షేక్ హైమద్, ఇంతియాజ్,అబ్దుల్ భారి, అశోక్, రేసు హన్మండ్లు, శ్రీనివాస్ గౌడ్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love