కన్నుల పండుగగా రాములోరి కళ్యాణం

– వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
– భక్తులతో సందడిగా మారిన రామాలయాలు
– రామరసం పంపిణి, అన్నదాన కార్యక్రమం
నవతెలంగాణ – కంటేశ్వర్
జగదానంద కారకుడి జగత్ కళ్యాణం బుధవారం కన్నుల పండుగగా జరిగింది. వేదమంత్రాలు, ముత్యాల తలంబ్రాలు సన్నాయి మేళంతో సీత రామచంద్రుని వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. పెళ్లి పెద్దలు గా సీతమ్మను శ్రీరామ చంద్రునికి కన్యా దానం చేసే అదృష్టం తమకు దక్కిందని, కట్న కానుకలను సమర్పించి పుణ్య లోకాలను పొందామని అంటూ రాములోరి పెళ్లి వేడుకను సేవకులు కనులారా చూసి తరించారు. సీతారాములు కల్యాణం కన్నుల పండుగగా అర్చకులు ఆలయ సిబ్బంది. ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు. సీతారాముల జన్మ నక్షత్రం చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్న అభిజిత్ లగ్న ముహూ ర్తమున శ్రీరామచంద్రుడు  సీతమ్మ మెడలో మంగళ ధారణ చేశాడు. వేదపండితులు నిర్ణయించిన ముహూర్తానికి అంగరంగ వైభవంగా శ్రీ రాముని వివాహం జరిగింది. నగరం లోని ఖిల్లా రామాలయం లో శ్రీ సీతారాముల కళ్యాణం వేడుక ఘనంగా నిర్వహించారు. శ్రీరాముని వివాహ మహోత్సవానికి ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ ఘట్టం లో ముఖ్యమైంది మధుపర్కం, జీలకర్ర, బెల్లం, కన్యాదానం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు తంతును శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితులు పురోహితుల ఆధ్వర్యంలో కళ్యాణం జరపగా, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనగా సీతారామ చంద్రుని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ఆలయ కమిటీ చైర్మన్ అధ్యక్షులుముక్కా దేవేందర్ గుప్త, సెక్రెటరీ గురుప్రసాద్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణంఘనంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణోత్సవానికి కళ్యాణ సేవకులుగా ఎస్ ఎస్ ఆర్ విద్యాసంస్థలు చైర్మన్ హరిత మారయ్య గౌడ్ దంపతులు మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల శ్రీలక్ష్మి జ్ఞానేందర్ గుప్త దంపతులు, ఎల్ వి ఆర్ షాపింగ్ మాల్ పద్మా రజిత శివప్రసాద్, ధన్ పాల్ అంజలి ఉదయ్ కుమార్ స్వామి వారి కళ్యాణ వస్త్రంల దాత  మంగళ సూత్రం సేవాదాత పాల్దే లక్ష్మీకాంతం కళ్యాణ మండపం అలంకరణ దాత అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త శ్రీరామనవమి కళ్యాణోత్సవ కమిటీ పూజా విభాగం దాతలు  కొండ వీర శేఖర్ ఆహ్వాన కమిటీ డి రాజేంద్రప్రసాద్ తాటి వీరేశం బెలాల్ పోతన్న కొండా దేవేందర్ సేవ చేశారు. అక్షయపాత్ర విభాగంలో తాటి వీరేశం గుప్తా చల్లా గంగాధర్ గాదే సుదర్శన్ గుప్త సేవ చేశారు. శ్రీరామ నవమి వేడుకల్లో అర్బన్ శాసనసభ్యులు దన్ పాల్ సూర్యనారాయణ గుప్త, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు పాల్గొనగా, కల్యాణోత్సవం నాని స్వామి. పంతులు బృందం ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ వేడుక కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ సభ్యులు , రాజేంద్రప్రసాద్, ఆలయ పూజారి సందీప్ శర్మ,  తదితరులు పాల్గొన్నారు.
కోదండ రామాలయంలో..
నగరంలోని న్యాల్కల్ రోడ్డు వద్ద గల అయోధ్య నగర్ కోదండ రామాలయం లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మూఢ బాలయ్య ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. శ్రీరాముని ఉత్సవ విగ్రహములకు  అభిషేకం అలంకరణ నామకరణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో , మూడ భాస్కర్ , గోదావరి మూడశ్రీనివాస్ వీణ అమర్నాథ్ కరుణ ఆలయ కమిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సుభాష్ నగర్ రామాలయంలో..
 నగరంలోని సుభాష్ నగర్ రామాలయం లో శ్రీరామ నగరంలోని నవమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. చైత్ర శుద్ధ నవమి పునరావాస నక్షత్ర లగ్న అభిజిత్ లగ్నం. ముహూర్తమున శ్రీరామచంద్రుడు సీతమ్మ మెడలో మంగళ ధారణ చేశాడు. వేదపండితులు నిర్ణయించిన ముహూర్తానికి అంగరంగ వైభవంగా శ్రీ రాముని వివాహం జరిగింది. అర్చకులు, ఆలయ కమిటీ సిబ్బంది. సీతారాముల కళ్యాణం కన్నులారా చూసి తరించారు. ప్రత్యేక పూజలు హారతి అర్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.
ఆర్య నగర్ రామాలయంలో..
ఆర్య నగర్ రామాలయంలో సీతారాముల కళ్యాణ వేడుక ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీరామునికి పంచామృత అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ  ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ జోషి మధుసూదన్ శర్మ అభిషేకము కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు.
జండా బాలాజీ ఆలయంలో..
నగరంలోని జండా బాలాజీ దేవస్థానము లో బుధవారం శ్రీ రామ నవమి సందర్బముగా సీతారాముల  కళ్యాణము ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమములో ఇఓ గింజుపల్లి వేణు ,చైర్మెన్ జాలిగం గోపాల్, అర్చకులు నాగరాజ చార్యలు జూనియర్ అసిస్టెంట్ శివరాత్రి అంజనేయులు  భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love