కాంగ్రెస్‌ కసరత్తు

 Congress exercise– రంగంలోకి ఎన్నికల కమిటీలు.. సమావేశాలతో బిజీబిజీ
– మ్యానిఫెస్టో, కమ్యూనికేషన్‌ కమిటీపై ప్రత్యేక దృష్టి
– ఆ ‘ఐదు’ హామీలపై స్పెషల్‌ ఫోకస్‌
– ప్రతిష్టాత్మకంగా సీడబ్య్లూసీ సమావేశాలు
– విజయభేరికి భారీగా జనసమీకరణ
ప్రతి కార్యకర్త తరలిరావాలి
ఈ నెల17న తుక్కుగూడలో జరగబోయే విజయభేరి సభకు ప్రతి కార్యకర్త తరలిరావాలని ఎంపీ ఎన్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. మొదటిసారి సీడబ్య్లుసీ సమావేశాల ద్వారా హైదరాబాద్‌లో జరుగుతున్నాయని తెలిపారు. విజయ భేరి సభలో సోనియగాంధీ ఐదు హామీలను విడుదల చేస్తారని, ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు.
– ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటిదాకా సభలు, పాదయాత్రలు, ఇతర పార్టీ నేతల చేరికలపై దృష్టి సారించింది. వాటిని కొనసాగిస్తూనే…అంతర్గతంగా యావత్‌ పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నది. రాష్ట్రస్థాయి నేతలందరికీ వివిధ కమిటీల్లో బాధ్యతలు అప్పగిం చింది.ఎన్నికల ప్రక్రియతోపాటు సీడబ్ల్యూసీ సమావేశాలను ఆయా కమిటీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అందులో భాగంగా గత రెండు రోజులుగా ఆయా కమిటీలు సమావేశమై ప్రాథమిక చర్చ ప్రారంభించాయి. దీంతో గాంధీభవన్‌ రద్దీగా మారింది. అన్ని కమిటీల్లో కెల్ల మ్యానిఫెస్టో కమిటీకి, కమ్యూనికేషన్‌ అండ్‌ మీడియా కమిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే మ్యానిఫెస్టో కమిటీ సమావేశమై వివిధ వర్గాలతో చర్చలు ప్రారంభించింది. ఈనెల 17న విజయభేరి సభలో ఐదు హామీలపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసి అధిష్టానానికి పంపించినట్టు తెలిసింది. వాటిని పార్టీ అత్యంత గోప్యంగా ఉంచుతున్నది. దీనిపై మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్‌ శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తినబోతు రుచులు ఎందుకు? సోనియాగాంధీ ప్రకటించిన తర్వాత ఇంటింటికి చేర్చుతామని ఆయన నవతెలంగాణకు చెప్పారు. సీడబ్య్లూసీ
సమావేశాలతోపాటు ఎన్నికల సమరంలో పార్టీకి, ప్రజలకు కమ్యూనికేషన్‌, మీడియా పాత్ర కీలకమని భావిస్తున్నది. అందుకే కమ్యూనికేషన్‌ అండ్‌ మీడియా కమిటీ చైర్మెన్‌గా సీనియర్‌ నేత కుసుమకుమార్‌ను నియమించింది. ఎన్నికల్లో పార్టీ ఇచ్చే హామీలు, బీఆర్‌ఎస్‌, బీజేపీని ఎదుర్కొని, వాటికి ధీటైన సమాధానం ఇచ్చేందుకు సోషల్‌ మీడియాను ప్రముఖంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు సోషల్‌ మీడియా బాధ్యులను నియమిస్తోంది. పార్టీ ఏదైనా ఒక ప్రకటన విడుదల చేసిన వెంటనే అది మారుమూల పల్లెలకు చేరేలా పక్కా ప్లాన్‌ చేస్తోంది. అధికార పార్టీ వైఫల్యాలను, బీజేపీ విద్వేషపూరిత వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది. తద్వారా ప్రజలకు మరింత దగ్గరై…ఓటర్లను ఆకర్షించేలా ప్రణాళికలు రచిస్తోంది. అందుకు గాంధీభవన్‌లో ఓ లైబ్రరీని సైతం ఏర్పాటు చేయబోతున్నది.
సభలను అడ్డుకునే సంస్కృతి ఇక్కడే : ఠాక్రే
ప్రతిపక్ష పార్టీల సభను అడ్డుకునే సంస్కృతిని తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నానని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే చెప్పారు. సీడబ్య్లుసీ సమావేశాలు దేశానికి మంచి సంకేతం ఇస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటై విజయభేరి సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.
నియోజకవర్గాల వారీగా చార్జిషీట్‌ విడుదల : సంపత్‌కుమార్‌
ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ చార్జిషీట్‌ విడుదల చేశామని చార్జిషీట్‌ కమిటీ చైర్మెన్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ తెలిపారు. త్వరలో నియోజకవర్గాల వారీగా విడుదల చేస్తామన్నారు. అందులో ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలు, అమలు కానీ హామీలు ఉంటాయని తెలిపారు. ఈ తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ అసమర్థ పాలనను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ‘తిరగబడుదాం…తరిమికొడదాం’ కార్యక్రమాన్ని పోస్టు కార్డు ద్వారా ప్రతి ఇంటికి చేరవేయాలని కోరారు.
విజయభేరికి విస్తృత ప్రచారం :కుసుమకుమార్‌, చామలకిరణ్‌కుమార్‌రెడ్డి
తుక్కుగూడ విజయభేరి సభను విజయవంతం చేసేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నామని కమ్యూనికేషన్‌ అండ్‌ మీడియా కమిటీ చైర్మెన్‌ కుసుమకుమార్‌, పార్టీ ఉపాధ్యక్షులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సభకు ముఖ్యనేతలతోపాటు 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న టీపీసీసీ, సీఎల్పీ నాయకులు వస్తున్నారని వివరించారు. ఏఐసీసీ మాదిరిగా గాంధీభవన్‌లో లైబ్రరీ,రీసెర్చ్‌ వింగ్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పది రోజుల్లో నివేదిక ఇస్తాం : ప్రేమ్‌సాగర్‌ రావు
కాంగ్రెస్‌ పార్టీ అధికారం లోకి తీసుకురావడానికి అవసరమైన పక్కా వ్యూహాన్ని తయారు చేస్తున్నామని టీపీసీసీ స్ట్రాటజీ కమిటీ చైర్మెన్‌ ప్రేమ్‌సాగర్‌రావు వెల్లడించారు. ఆ నివేదికను పది రోజుల్లో అధిష్టానానికి అందజేస్తామన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న

Spread the love