కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి..

Congress government should implement the promises given to the people..– సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా..
నవతెలంగాణ – డిచ్ పల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ జిల్లా నాయకులు సాయ గౌడ్ అన్నారు. సోమవారం డిచ్ పల్లి మండల కేంద్రంలో డిమాండ్లతో ముద్రించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హైదరాబాద్ లో ఆగస్టు 22న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం  చేయాలని ప్రజలకు పిలుపునిస్తూ డిమాండ్స్ తో  ముద్రించిన వాల్ పోస్టర్ లాను  ఆవిష్కరించమని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి నూతన రేషన్ కార్డులు ఇస్తామని, చేయూత పెన్షన్ రూ.4000 రూపాయలు పెంచుతామని, అలాగే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇంటి స్థలం ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇంకా అనేక హామీలను ఇచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్న హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు విసిగి వేసారి పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని గుర్తు చేశారు. హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ కాలం వెల్లదిస్తున్నారని పేర్కొన్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు. లేని పక్షంలో ప్రజలే న్యాయ నిర్నేతలై మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని  అన్నారు. ఈ కార్యక్రమంలో మురళి , పార్టీ మండల కార్యదర్శి గంగామల్లు, పద్మ, అమృత, రాజవ్వ, చంద్రయ్య, రాజు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Spread the love