
బిబిపేట్ మండలం నుండి భిక్నూర్ మండలానికి బదిలీపై వచ్చిన ఎస్సై సాయికుమార్ ను కాంగ్రెస్ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. శాంతి భద్రత పరిరక్షణకు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, నాయకులు అంకం రాజు, సిద్దా గౌడ్, ఆంజనేయులు, సిద్ధ రాములు, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.