పీసీసీ అధ్యక్షుని కలిసిన కాంగ్రెస్ నాయకులు

Congress leaders met PCC presidentనవతెలంగాణ – కమ్మర్ పల్లి
బాల్కొండ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్, శివాన్నోళ్ల శివకుమార్, ఎర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు దేవరెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పడిగేలా ప్రవీణ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి మండల నాయకులు రేవతి గంగాధర్, తెడ్డు రమేష్, రాజ్ ముత్యం, ఇతర కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love