నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం వైస్ చైర్మెన్, బహదూర్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కలీంబాబా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు. ఆయనతోపాటు నగరానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు సయ్యద్ షా, ఎమ్‌డీ రహీం, అక్బర్, నూర్ అన్వర్, మజీద్, అత్తార్ తదితరులు ఆప్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. సామాన్యుల కోసం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న కృషిని చూసి పలువురు పార్టీలో చేరుతున్నారని చెప్పారు.