విజయుడి నామినేషన్‌ పెండింగ్‌లో పెట్టండి : కాంగ్రెస్‌

విజయుడి నామినేషన్‌ పెండింగ్‌లో పెట్టండి : కాంగ్రెస్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అలంపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయుడు సమర్పించిన నామినేషన్‌ ను పెండింగ్‌లో పెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు నిరంజన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. విజయుడు పుల్లూరు గ్రామంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న విజయుడు రాజీనామా చేసినట్టు గాని, రాజీనామా ఆమోదం పొందినట్టు గాని సమాచారం లేదని తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సంపత్‌ కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు గుర్తుచేశారు. విజయుడు నామినేషన్‌ విషయంపై తాము ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. విజయుడుపై పూర్తి సమాచారం వచ్చే వరకు ఆ నామినేషన్‌ను పెండింగ్‌లో పెట్టాలని డిమాండ్‌ చేశారు.

Spread the love