కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు కృతజ్ఞతలు

– వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్‌
నవతెలంగాణ-వైరాటౌన్‌
ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించినందుకు వైరా నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులకు ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. బుధవారం మండల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామసహాయం రఘురాం రెడ్డికి 4 లక్షల 60 వేల పైచిలుకు మెజారిటీతో భారీ విజయాన్ని అందించిన ప్రజలకు, కష్టపడి పనిచేసి విజయానికి దోహదపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని, అసెంబ్లీ ఎన్నికల్లో నాకు 36 వేల మెజార్టీ ఇచ్చి వైరా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పంపించారని, దానికి రెండింతలు మెజారిటీతో రామసహాయం రఘురాం రెడ్డికి భారీ విజయనందించిన నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. మీ రుణం తీర్చుకోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చారని, మరల రామ సహాయం రఘురాం రెడ్డికి ఓట్లు వేసి నా బాధ్యతను పెంచారని, కేంద్రం నుంచి రామ సహాయం రఘురాం రెడ్డి ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి రుణం తీర్చుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, వైరా సొసైటీ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, రాష్ట్ర కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు దాసరి దానియేలు, కట్ల రంగారావు, గుత్తా వెంకటేశ్వరరావు, పొదిల హరినాథ్‌, బోళ్ళ గంగారావు, పాలేటి నరసింహారావు, పమ్మి అశోక్‌, చెప్పిడి వెంకటేశ్వరరావు, ఆది ఆనందరావు, పల్లపు కొండలు, పణిత శీను, వాడపల్లి రామారావు, శీలం చంద్రశేఖర్‌ రెడ్డి, ఐ.వి.ఎస్‌ నాగేశ్వరరావు, మేడూరి రామారావు, పాల్గొన్నారు.

Spread the love