కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి..

-17 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు..
-తెలంగాణ మహిళా యూనివర్సిటీ సెల్ఫ్ కాంట్రాక్టు టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు నరసింహారావు
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయల లో పని చేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ లను రెగులర్ చేయాలని బుధవారం కోఠి తెలంగాణ మహిళా యూనివర్సిటీ లో ధర్నా నిర్వహించారు. బుధవారం కోఠి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం నుండి రోడ్డుపైకి నిరసనకు వస్తున్న లెక్చరర్ లను సుల్తాన్ బజార్ పోలీసులు వారిని అడ్డుకొని యూనివర్సిటీ ప్రధాన గేటును మూసివేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఈ సందర్భంగా తెలంగాణ మహిళయూనివర్సిటీ సెల్ఫ్ కాంట్రాక్ట్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు నరసింహారావు మాట్లాడుతూ….తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 12విశ్వవిద్యాలయాలలో ఉన్న 1435మంది కట్రాక్టు లెక్టచరర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ గతంలోకేసీఆర్ లెక్చరర్లను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినకా సీఎం కేసీఆర్ కాంట్రాక్టు వ్యవస్థ లేకుండా చేస్తానని హామీ కూడా ఇచ్చారని తెలిపారు.తాము గత 30 సంవత్సరాలుగా విద్యానందిస్తున్నామన్నారు.తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చకుంటే విశ్వవిద్యాలయలలో విద్యను స్తంభింపజేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున్న నిరసనలు వ్యక్తం చేస్తామని అధ్యాపకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేఖర్ రెడ్డి, డాక్టర్ ఉపేంద్ర, డాక్టర్ దీపిక ,డాక్టర్ అశ్లేష, డాక్టర్ ధర్మ తేజ, డాక్టర్ విజేందర్ రెడ్డి, డాక్టర్ స్రవంతి, డాక్టర్ సనాత్, సిహెచ్ వెంకటేశ్వర్లు, డాక్టర్ కుమార్, యాదయ్య, దూలపల్లి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు
Spread the love