నవతెలంగాణ-దుండిగల్
పర్యావరణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాల ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోలను శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మానవాళి మనుగడకు పర్యావరణం ఎంతో ముఖ్యమని ప్రతీ కుటుంబం తమ చుట్టుపక్కల పరిసరాలలో మొక్కల పెంపకం చేపట్టాల ని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం శ్రీనివాస్ రెడ్డి వారి ఇంటి ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కే.ఎస్.ఆర్ మాట్లాడు తూ చెట్లు మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతు న్నాయని, ప్రధానంగా మనకి ప్రాణ వాయువుని ఇస్తున్నాయని పేర్కొన్నారు. అలాంటి చెట్లని నరికివేసి, పర్యావరణా నికి, పాటూ వివిధ జీవుల జీవనానికి హాని కలిగిస్తున్నా రని తెలిపారు. అలా చేయటం వల్లనే వేసవి కాలం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి, ప్రజలు వడదెబ్బలకు గురవుతున్నారని, పర్యావరణ అభివృద్ధికి అందరం కలసికట్టుగా చేయూత ఇవ్వాలని తెలిపారు. పర్యావరణా న్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని..ప్రతీ ఒక్కరు కనీసం రెండు మొక్కలు నాటాలని, జీవన శైలిని మెరుగుపరిచే మార్పు ఎలాంటిదైనా మనతోనే మొదల వ్వాలని” అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లాడి మహేష్, లింగాల గంగాధర్, పి.ప్రభాకర్ రెడ్డి, ఎన్.బాలకృష్ణ, ప్రశాంత్ రెడ్డి, సర్ల లక్ష్మణ్, శివనాగరాజు యాదవ్ పలువురు ప్రజలు పాల్గొన్నారు.