పరస్పరం సహకరించుకోవాలి

– మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ, అమెరికాలోని అయోవా రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆమెరికా పర్యటనలో ఉన్న మంత్రి అయోవా రాష్ట్ర రాజధాని డెమోయిన్‌ నగరంలో రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆడమ్‌ గ్రెగ్‌ను కలిశారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు సాధించిన ప్రగతిని వివరించారు. అయోవా, తెలంగాణ మధ్య అనేక విషయాల్లో సారూప్యత ఉందని తెలిపారు. అనంతరం మంత్రి అయోవా స్టేట్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ ను సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఇరు విశ్వవిద్యాలయాలు తాము చేస్తున్న పరిశోధనల విషయంలో కూడా పరస్పరం సహకరించుకోవాలనే విషయంపై చర్చించారు.

Spread the love