ఆలూరు మండలంలోని రాంచంద్రపల్లి సీపీఐ(ఎం) శాఖ సమావేశం మహాసభ బుదవారం నిర్వహించారు. ఈ మహాసభకు జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు వెంకటేష్ హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. గత మూడు సంవత్సరాల పోరాటాల గురించి చర్చించారు. మున్ముందు పోరాటాలకు ముందుంటమని ,పార్టీ కట్టుబాట్లు కట్టుబడి పని చేస్తామని, పార్టీని ముందుకు తీసుకుపోవడానికి సహకరిస్తామని అన్నారు. ఇడగొట్టి సాయిలు మాట్లాడుతూ.. పార్టీ నిబంధనలకు అనుగుణంగా ఉంటూ పార్టీ పిలుపులను అనుసరించాలని తెలిపారు. నూతన కార్యదర్శిగా ఇడగొట్టి సాయిలు, రెండవ కార్యదర్శి సుకన్య ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.