సీపీఐ(ఎం) అభ్యర్ధి అర్జున్ రావు పిట్టల

 – నియోజక వర్గం పై పూర్తి అవగాహన ఉంది
– సమగ్ర అభివృద్దే ధ్యేయం…
– సీపీఐ(ఎం) అభ్యర్ధి అర్జున్ రావు పిట్టల.
నవతెలంగాణ – అశ్వారావుపేట: పలు కార్మిక సంఘాలకు నేతృత్వం వహిస్తున్న నాయకుడి గా, సామాజిక అవగాహన, నియోజక వర్గం లోని ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘ కాలిక సమస్యలు పై పూర్తి అవగాహన ఉందని, తాను ఎమ్మెల్యే అయితే తన పరిపాలన ఎలా ఉంటుందో సీపీఐ(ఎం) అభ్యర్ధి అర్జున్ రావు పిట్టల ఆయనే తన మాటలు ద్వారా తెలిపారు.
ఆయనతో నవతెలంగాణ ముఖాముఖీ..
నవతెలంగాణ : సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీలో ఉన్న మీరు ఈ నియోజక వర్గంలో ఏ ఏ సమస్యలు గుర్తించారు
జవాబు : నియోజకవర్గం లో ప్రధానంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు పూర్తి స్థాయిలో నేటి వరకు అందలేదు.వ్యవసాయానికి సాగునీటి సమస్య, రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. పామాయిల్ సాగు విస్తారంగా చేపడుతున్న రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదు. వసతి గృహాల్లో, ఆశ్రమ పాఠశాలలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కీం వర్కర్లు సంఘటిత రంగ కార్మికులకు వేతనాలు సమస్య, తామ చేస్తున్న కష్టానికి తగిన వేతనాలు లేవు. వితంతువులకు పెన్షన్లు, పేద కుటుంబాలకు రేషన్ కార్డుల సమస్య ఉంది. యువతకు ఉద్యోగాలు కల్పన లేదు. ప్రభుత్వ శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం కూలీలకు అర్హులైన వారికి తగిన పని దినాలు కల్పించడంలో, చేసిన పనికి కూలి డబ్బులు సరైన సమయంలో చెల్లించడంలో వైఫల్యం ఉంది. కొలతల పద్ధతులు కాకుండా పనిచేస్తున్న కూలీలకు రోజు వారీ కూలీ ఇవ్వాలి. ఇల్లు, ఇళ్ల స్థలాలు లేని పేదలు వందల మంది ఉన్నారు. వీరికి ఇంటి స్థలం కేటాయించి ఇల్లు నిర్మించడంలో ప్రభుత్వ వైఫల్యం ఉంది.

నవతెలంగాణ : వీటిని మీరు ఎలా పరిష్కారం ఇస్తారు?
జవాబు: నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపిస్తే అసెంబ్లీలో వివిధ వర్గాల ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాను. అసెంబ్లీ బయట కూడా ప్రజలను సమీకరించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు పోరాటాలు ఉధృతం చేస్తాను.
నవతెలంగాణ : మీరు గీతం లో నిర్వహించిన ఉద్యమాలు ఏమిటి? సాధించిన విజయాలు ఏమిటి?
జవాబు : గతంలో రైతులు, వ్యవసాయ కూలీలు,  భవన నిర్మాణ, సంఘటిత, అసంఘటిత కార్మికులు, స్కీం వర్కర్స్, వృత్తిదారులు, మహిళల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. గిరిజన గిరిజనేతర పేదలకు పోడు భూములు కొట్టించి, అటవీ హక్కుల చట్ట ప్రకారం పార్టీ నిర్వహించిన ఆందోళన పోరాటాల్లో పాల్గొన్నాను. పోడు పట్టాల సమస్య కొంతవరకు పరిష్కారం అయింది. ఆశ, అంగన్వాడి,మధ్యాహ్న భోజనం, గ్రామ దీపిక లు, గ్రామపంచాయతీ కార్మికులు, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కార్మికులు, నర్సరీ కార్మికులు, ఆయిల్ ఫామ్ గెలలు కోత లేక సేకరణ కార్మికుల సమస్యలపై స్థానికంగా సంబంధిత అధికారులు వద్ద నిరసన కార్యక్రమాలు సమ్మెలు నిర్వహించి అనేక విజయాలు సాధించడం జరిగింది.
Spread the love