స్వామినాథన్‌కు శ్రద్ధాంజలి ఘటించిన సీపీఐ(ఎం) నాయకులు

నవతెలంగాణ-చిట్యాలటౌన్‌
వ్యవసాయ రంగం ,రైతుఅభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన వారు, హరిత విప్లవ పితామహుడు డా, ఎం.ఎస్‌.స్వామినాధన్‌ అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్‌ అన్నారు.చిట్యాల మండల కేంద్రంలో శనివారం ఆ పార్టీ, రైతు సంఘం మండల కమిటీ ల ఆధ్వర్యంలో స్వామినాథన్‌ సంతాప సభ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో స్వామినాథన్‌ కమిటీ నివేదిక ద్వారా వ్యవసాయ, రైతు సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు లభించాయని చెప్పారు.ఆహర ఉత్పత్తులు పెరుగుతుండటంతో పాటు కరువు, ఆకలి చావులు నియంత్రించే చర్యలు తీసుకోబడ్డాయఅన్నారు.దేశంలో స్వామి నాధన్‌ కమీషన్‌ సిఫార్సులు అమలు చేయడమే ప్రభుత్వం వారికి ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ, రూరల్‌ మండల కార్యదర్శి అరూరి శ్రీను, మండల నాయకులు నారబోయిన శ్రీనివాసులు, శీలా రాజయ్య, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఐతరాజు నర్సింహా, మండల అధ్యక్షులు లడే రాములు, వివిధ ప్రజా సంఘాల నాయకులు సుర్కంటి బుచ్చి రెడ్డి, దేశబోయిన లింగస్వామి, కత్తుల యాదయ్య, బొడ్డు బాబురావు, జిట్ట స్వామి, రమాదేవి,నజీరొద్దీన్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love