హనుమాపురంలో దేశవ్యాప్త సమ్మె విజయవంతం: సీపీఐ(ఎం)

– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నరసింహ
నవతెలంగాణ-  భువనగిరి రూరల్ 
 మండలంలోని హనుమాపురం గ్రామంలో దేశవ్యాప్త సమ్మె  కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నరసింహ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు ఉపాధి హామీ కార్మిక చట్టాల  చట్టాలపై మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గ్రామీణ   బంధు నిర్వహించినట్లు తెలిపారు.  మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్లకు కట్టబెడుతూ ప్రైవేటు పరం చేస్తూ అనేక నిత్యవస ధరలు పెంచుతూ కొత్త కొత్త రైతు చట్టాలు తీసుకొచ్చి రైతులకు మద్దతు ధర ఇవ్వకపోవడం కార్మికులకు కనీస వేతనం రూ.26000 ఇవ్వకపోవడం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం రైతులు కార్మికుల పేదల కోసం ఏ ఒక్క మంచి పని కూడా చేయకపోవడం ఆయన బడా కంపెనీల కార్పొరేట్ల కోసం దేశాన్ని తాకట్టు పెడుతుందని విమర్శించారు.  ఇప్పటికైనా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని,  రాబోయే ఎన్నికలలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె  దించాలని ప్రజలని నరసింహ కోరారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి మోట ఎల్లయ్య,  రైతులు రంగా నారాయణ, కార్మికులు శీను,  నరసింహ, బిక్షపతి, మల్లేష్, రాజమణి, బల్లమ్మ, అంగన్వాడీ టీచర్ ఉమా లు పాల్గొన్నారు.
Spread the love