నవతెలంగాణ-మట్టెవాడ
కేంద్రంలోని బీజేపీ అధికారం చేపట్టాక ప్రజలపై భారం పడేలా నిత్యవసర సరుకుల ధరలను పెంచుకుంటూ పోతుందని దేశంలో నిరుద్యోగం తో పేదరికం తాండవిస్తుంటే మతవిద్వేషాలను రెచ్చగొడుతూ బిజెపి కాలం వెళ్లదీస్తుందని బిజె పిని ఇంటికి పంపించాలని సీపీఎం వరంగల్ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య పిలుపునిచ్చారు. సీపీఎంరంగశాయిపేట ఏరియా కమిటీ ఆధ్వర్యంలో కేంద్రంలోని బిజెపి పరిపాలనలో పెరిగిన నిత్యవసరాలు, నిరుద్యోగ, ప్రజా వ్యతిరేక విధానా లపై భారీ నిరసన కార్యక్రమం శంభునిపేట జంక్షన్‌లో బుధవారం నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా జిల్లా కార్యదర్శి రంగయ్య పాల్గొని మాట్లా డుతూ బీజేపీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు పెనుభారమయ్యేలా నిత్యా వసర వస్తువులు వంట నూనె పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచుతుందనీ అన్నారు. ఇదేగాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని దుయ్య బట్టారు. ఏటా 2కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి గాలికి వొదిలేసయని 9 సంవత్సరాలనుండి ఎంతో మంది విద్యార్థులు డిగ్రీలు పీజీలు చదివి ఉద్యోగాలు లేక బట్టల షాపులలో చిన్నచిన్న షాపులలో పనిచేస్తున్నారన్నారు.
ప్రభుత్వ వైఖరికి నిరసనగా రంగశాయిపేట ఏరియా లో భారీ నిరసన చేపట్టామన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహిళలు, పార్టీ శ్రేణులు ఈ నిరసనకు భారీగా తరలి వచ్చారంటే పెరిగిన ధరలతో పేదలు ఎంతలా ఇబ్బంది పడుతున్నారు. పాలకులు గ్రహించి ధరలను తగ్గించాలని లేనిపక్షంలో ప్రభుత్వాల ను ఇంటికి పంపిస్తారని హెచ్చరించారు. రంగసాయిపేట ఏరియాకార్యదర్శి మాలోతు సాగర్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే విధంగా ప్రజావ్యతిరేక విధానాలుఅమలు చేస్తోందని మండిపడ్డారు. వెంట నే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను నిత్యావసర వస్తువులను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ అచ్చే దిన్ ఆయేగా.. అచ్చే దిన్ ఆయేగా.. అని సామాన్య ప్రజలు బతకలేని స్థితికి తీసుకువచ్చి సచ్చే దిన్ తీసుకువచ్చారని ఆరో పించారు. కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు. ధరల నియం త్రణలో మోడీ ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని పేర్కొ న్నారు.
పెరిగిన ధరలు సామాన్య ప్రజలకు గుది బండగా మారాయని వెల్లడించా రు. కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తూ ఏడాపెడా రేట్లు పెంచుతున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ పిడికిలి బిగించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తూ, దేశాన్ని, దేశ ప్రజలను పాతాళంలోకి నేడుతున్న బీజేపీ పార్టీని గద్దె దించేవరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం ఏరియా కమిటీ నాయకులు మాలోతు ప్రత్యుష, యం జ్యోతి, గణేపాక ఓదెలు, కేవీపీస్ ఏరియా కార్యదర్శి ఉసిల్ల కుమార్, సోషల్ మీడియా కన్వీనర్ గజ్జ చందు, డివైఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రామ సందీప్ ,ప్రజా నాట్యమండలి జిల్లాఅధ్యక్షులు దాసారపు అనీల్, ఆవాజ్ కమిటీ ఏరియా కార్యదర్శి యండి అతిక్, శాఖ కార్యదర్శులు కొత్తూరు అనీల్ ,యాకయ్య, బక్కి శివ రాజు, మైరున్నీసా, మౌనిక, లక్ష్మణ్, ప్రభాకర్, శ్యామ్, కోటేశ్వర్, సుమలత, సునీల్, పెద్ద లావణ్య, , ఉసిల్ల దీప ప్రకాష్ ఉదయశ్రీ మల్లయ్య వెంకటలషక్ష్మి నజీయా సిపిఎం నాయకులు, మహిళలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
బడుగులపై ధరల పెనుభారం మోపిన కేంద్రం : సీపీఎం
12:15 am