సెంట్రల్ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశం కొరకు సి యు ఈ టి ఎంట్రన్స్ పరీక్ష

నవతెలంగాణ – కంటేశ్వర్
దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీస్ డిగ్రీ ప్రవేశం కొరకు నిర్వహించే సి యు ఈ టి (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) నిజామాబాదులో సోమవారం నుండి (23/05/23) నుండి ప్రారంభం కావడం జరిగింది అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జిల్లా కో-ఆర్డినేటర్ భాస్కర్ మేరీగ ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ లోని బోధన్ రోడ్ గల ఏవి ఎంటర్ప్రైజెస్ లో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తున్నారు.  ఈ పరీక్షలను మొత్తం మూడు షిఫ్టులలో నిర్వహిస్తున్నారు.
షిఫ్ట్ – I – 8:30 – 10:30,
షిఫ్ట్ – II – 12:00 – 2:00,
షిఫ్ట్ – III – 3:30 – 6:30,
సోమవారం జరిగిన పరీక్షకు 171 మంది విద్యార్థులకు గాను 124 మంది విద్యార్థులు హాజరైనారు. నేడు అనగా బుధవారం కూడా పరీక్ష 3 షిఫ్ట్ లలో నిర్వహించడం జరుగుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టి ఏ) జిల్లా కో-ఆర్డినేటర్ భాస్కర్ మేరీగ తెలిపారు.
సియుఈటి పరీక్షకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్న సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8978198421కు సంప్రదించాలన్నారు.

Spread the love