గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించిన సాంస్కృతిక కార్యక్రమాలు

– జెడి డిఎస్ జగన్
నవతెలంగాణ -తాడ్వాయి : గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సమాచార పార సంబంధాల శాఖ సంయుక్త సంచాలకులు డిఎస్ జగన్ పేర్కొన్నారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఆదివాసుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మేడారం జాతర ప్రారంభానికి ముందు ఈ నెల 21 నుండి 24 వరకు నాలుగు రోజుల పాటు 40 బృందాలచే ప్రతిరోజు 10 ప్రాంతాల్లో చిందు యక్ష గానం, జానపద, కోలాటం, మందహెచ్చులు, కళా రూపాలను మేడారం లోని చిలకలగట్టు, జంపన్నవాగు, గిరిజన మ్యూజియం, హరిత హోటల్, ఆర్టీసీ బస్ స్టేషన్, కన్నెపల్లి, గట్టమ్మ దేవాలయం తదితర ప్రాంతాల్లో ఆదివాసుల సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు.

Spread the love