కరెంట్‌ అఫైర్స్‌

Current Affairsఅత్యంత వేగవంత సెంచరీ – రోహిత్‌ శర్మ
12 అక్టోబర్‌ 2023 ఢిల్లీలో అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఆప్ఘనిస్తాన్‌ తో జరిగిన ప్రపంచకప్‌ 2023 మ్యాచ్‌లో భారత్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన 31వ వన్డే సెంచరీ సాధిం చాడు. రోహిత్‌ 63 బంతుల్లో తన సెంచరీ పూర్తి చేశాడు. ప్రపంచకప్‌ చరిత్రలో అత్యంత వేగవంత సెంచరీ సాధించిన భారతీయుడిగా రోహిత్‌ రికార్డ్‌ సృష్టించాడు. 1983 జింబాబ్వెపై కపిల్‌ దేవ్‌ 72 బంతుల్లో ఈ రికార్డ్‌ నెలకొల్పాడు.
ప్రపంచ ఆకలి సూచీ –
2023లో 111వ స్థానంలో భారత్‌
ప్రపంచ ఆహార సూచీ – 2023లో భారత్‌ 111వ స్థానంలో నిలి చింది. ఈ సూచీలో మొత్తం 125 దేశాల్లో ఇండియాకు 111వ ర్యాంకు దక్కింది. అయితే కేంద్రం ఇది ర్యాకంగ్‌ అంటూ మండిపడింది. అన్ని రకాలు సంక్షోభంలో వున్న పాకిస్థాన్‌ (102) శ్రీలంక 60తో పాటు బంగ్లా దేశ్‌ (81) నెపాల్‌ (61) మనకంటే మెరుగైన స్థానాల్లో ఎలా వున్నాయని కేంద్రం ఆశ్చర్యం వ్యక్త పరిచింది. 28.7 స్కోరులో బారల్‌ పరిస్థితి ఆందోళనకరంగా వుందని నివేదిక పేర్కొంది.
ప్యూమా రోప్స్‌
బ్రాండ్‌ అంబాసిడర్‌గా మహ్మద్‌
ప్రముఖ బ్రాండ్‌ అయిన ప్యూమా ప్రముఖ పాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీని బ్రాండ్‌ అంబా సిడర్‌గా చేర్చుకొన్నట్లు ప్రకటిం చింది. పాదరక్షలు, దుస్తులు, ఉప కరణాలతో సహ అన్ని రకాల ఉత్పత్తులకు ఈ భాగస్వామ్యం వర్తిస్తుంది.
గాజాకు 35 టన్నుల ఆహార పదార్థాలు, వైద్య పరికరాలు
ఇజ్రాయిల్‌ దాడులకు తీవ్రంగా నష్టపోయిన గాజాకు 35 టన్నుల ఆహార పదార్థాలు, వైద్య పరికరాలను భారత్‌ అందించింది. అక్టో బర్‌ 7న హమాస్‌ దాడి అనంతరం ఇజ్రాయిల్‌ గాజాపై బాంబు దాడులను కొనసాగించింది. ఈ నేపథ్యంలో గాజాలో భారీగా ప్రాణ నష్టం వాటిల్లింది. ఈ ఉగ్రదాడిని భారత్‌ ఖండించింది.
నిలవు కుడిచ సింహగల్‌ – ఎస్‌.సోమనాథ్‌
ఇస్రో చైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌ ”నిలవు కుడిచ సింహగల్‌” (వెన్నెల గ్రోలిన సింహాలు) పేరిట మలయాళంలో ఆత్మ కథను రాశారు. యువ తరానికి తన జీవితం స్ఫూర్తిగా నిలవాలనే ఈ ఆత్మకథ రాసినట్టు ఆయన వెల్లడించారు. అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టి ఇస్రో చైర్మన్‌గా ఎదిగిన తీరు, ఆ క్రమంలో ఎదురైన కష్టాలు ఆయన ఇందులో హృద్యంగా వివరించారు. చంద్రయాన్‌మిషన్‌ విజయం తనను ఆత్మకథ రచనకు పురిగొల్పిందని చెప్పారు.
దేశంలో తొలి బధిర మహిళా అడ్వకేట్‌ – సారా
భారత దేశ తొలి బధిర మహిళా అడ్వకేట్‌ సారా సన్ని తాజాగా సుప్రీంకోర్టులో సైన్‌ లాంగ్వేజ్‌లో వాదన వినిపించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి ఎదుట ఇంటర్‌ ప్రెటర్‌ సహాయంతో ఆమె తన వాదనలు వినిపించి ప్రశంసలు పొందింది. ”ఇలాంటిది ఇంతకు ముందే జరగాలి ఆలస్యం చేశాం” అని జస్టీస్‌ చంద్రచూడ్‌ సారాని ఉద్దేశించి అన్నారు. దివ్యాంగులు హక్కుల కోసం జావేద్‌ అబిధి ఫౌండేషన్‌ వారు వేసిన ఆ కేసులో ఫౌండేషనన తరపున సారా వాదనలు మొదలు పెట్టింది.
ఇక నుంచి ఈ – పాస్‌ పోర్టులు
పాస్‌పోర్టు సేవా ప్రోగ్రాం 2.0 కింద ఈ – పాసన పోర్టులను ఏడాది చివరి నాటికి ప్రవేశ పెట్టడం ద్వారా గణనీయమైన డిజటల్‌ మార్పునకు నాంది పలికేందుకు భారత్‌ సిద్ధమైంది. ఈ కొత్త ఈ పాస్‌పోర్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ చిప్‌తో వస్తుంది. వ్యక్తికి చెందిన బయో మెట్రిక్‌ డెటా ఇందులో నిక్షి ప్తమై వుంటుంది. దీని వల్ల అంత ర్జాతీయ సరి హద్దులో పాస్‌ పోర్టులను నకిలీ చేయడం కష్టతరం అవుతుందని విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్‌ తెలిపారు. ఈ ఈ-పాస్ట్‌పెర్ట్‌ను మొదట ఫిన్‌లాండ్‌ ప్రారంభించింది.
స్కిన్‌ క్యాన్సర్‌కు సబ్బు కనిపెట్టిన 14 ఏండ్ల హేమన్‌ బెకెలే
అమెరికాలోని వర్జిని యాకు చెందిన 14 ఏండ్ల హేమన్‌ బెకెలే స్కిన్‌ క్యాన్సర్‌ను జయించేలా సబ్బును కని పెట్టాడు. ఈ సబ్బు ధర కేవలం 800 రూపాయలు. ఈ సరి కొత్త ఆవిష్కరణకు టాప్‌ యంగ్‌ సైంటిస్ట్‌గా అవార్డు గెలుచుకున్నాడు. యు.ఎస్‌లో ప్రతి ఏడాది నిర్వహించే 2023 3ఎం యంగ్‌ సైంటిస్ట్‌ చాలెంజ్‌లో పాల్గొని దాదాపు 9 మందితో పోటిపడి బెకెలే యంగ్‌ సైంటిస్ట్‌గా విజయం కైవసం చేసుకొన్నాడు.
అమెరికాలో అంబేద్కర్‌ విగ్రహం
భారత రాజ్యాంగ రూపశిల్పి బి.ఆర్‌. అంబే డ్కర్‌ అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని అమెరికా రాజ ధాని వాషింగ్టన్‌ శివారు లోని మేరిల్యాండ్‌లో ఆవిష్కరించారు. అంబే ద్కర్‌ వర్ధంతి రోజైన 14న అంబేడ్కర్‌ ఇంటర్నే షనల్‌ సెంటర్‌ ప్రెసిడెంట్‌ రాజ్‌కుమార్‌ 19 అడు గులు ఎత్తైన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ”స్కాట్యు ఆఫ్‌ ఈ క్వాలిటీ”గా పిలుచుకునే ఈ విగ్రహ ఆవిష్కరణకు 500 మందికి పైగా భారతీయ అమెరికన్స్‌తో పాటు, భారత్‌ తదితర దేశాల నుంచి తరలి వచ్చారు. ఈ విగ్రహాన్ని ప్రత్యేక శిల్పి రామ్‌ సుతార రూపొందించారు.
భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్‌లో మరణ శిక్ష
గుడాచార్యం ఆరోపణలపై భారత నావికాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు ఖతార్‌ మరణ శిక్ష విధించింది. ఈ తీర్పుపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై అప్పీలుకు వెళ్ళనున్నట్లు ప్రకటించింది. ఈ కేసుకు అధిక ప్రాముఖ్యత ఇస్తామని, అన్ని రకాల సాయాన్ని అందిస్తామని పేర్కొంది.
ఆస్కార్‌ యాక్టర్స్‌ జాబితాలో ఎన్టీఆర్‌
ది అకాడమీ ఆఫ్‌ మోహన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (ఆస్కార్‌ కమిటి) తాజాగా వెల్లడించిన మెంబర్‌ క్లాస్‌ ఆఫ్‌ యాక్టర్స్‌ జాబితాలో ఎన్టీఆర్‌కు చోటు దక్కింది. ఎన్టీఆర్‌తో పాటు ఆమెరికన్‌ నటుడు కె.హ్యూక్వాన్‌, అమెరికన్‌ నటి మార్ష స్టెపానీ బ్లేక్‌, ఐరన్‌ నటి కెర్రీ కాండన్‌, అమెరికన్‌ కమ్‌ కెనెడియన్‌ నటి రోసా సలాజర్‌లు ఈ జాబితాలో నమోదయ్యారు.
1. హరప్పాలో చెక్కతో చేసిన శవ పేటిక లభ్యమయ్యింది
2. సుర్కొటడాలో కుండ పెంకులతో వున్న సమాధి లభ్యమైంది
3. లోధన్‌లో జంట ఖననం (ఆడ,మగ) లభ్యమయ్యింది.
4. కాలిబంగన్‌లో ఇటుకలుతో నిర్మించిన సమాది లభ్యమైంది.
5. సింధూ ప్రజల నదీ దేవత వాహనం – మొసలి
6. ప్రపంచంలో మొట్టమొదట ప్రత్తిని పండించిన వారు
– సింధూ ప్రజలు
7. సింధూ నాగరికత గురించి మొట్ట మొదట ప్రచురించిన పత్రిక
– లండన్‌ వీక్లి (1924)
8. మొదటసారిగా హరప్పా గురించి ప్రస్తావించిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉద్యోగి – సి.మానన్‌
9. మొసపటోమియా అంటే 2 నదులు మధ్యప్రాంతం అని అర్థం (ఇరాన్‌లోని టైగ్రిస్‌, యూప్రటీస్‌ నదులు మధ్య మొట్ట మొదట నాగరికత మొసపటామియా నాగరకత)
10. ప్రపంచంలో మొట్టమొదటి ట్రెడల్‌ ఫోర్టు – లోధర్‌
11. హరప్పాను 1921లో దయారామ్‌ సహని కనుగొన్నారు
– రావి నది ఒడ్డున
12. మొహంజొదారోను 1922లో సింధూ నది ఒడ్డున ఆర్‌.డి బెనర్జీ కనుగొన్నారు.
13. చాన్హూదారాను 1925లో సింధూ నది ఒడ్డున మంజుదార్‌, మాకి కనుగొన్నారు.
14. కాలిబంగన్‌ను 1953లో గాగ్గర్‌ నది ఒడ్డున ఏ.ఘోష్‌ కనుగొన్నారు.
15. లోథాల్‌ను 1957లో బాగావార్‌ నది ఒడ్డున ఆర్‌.ఆర్‌ రావు వాట్స్‌ కనుగొన్నారు.
16. చరిత్ర కారుల అభిప్రాయం ప్రకారం మొహంజదారో జనాభా
– 35000 – 41000
17. సింధు నాగరికతలో పశు సంవర్ధక కేంద్రాల పేరు – నేసదీ
18. లోధాల్‌లో దర్వాజాలు ప్రధాన వీధి వైపు అమర్చబడి వుండేవి.
19. వ్యవసాయం కోసం మొదటిసారిగా నదులుపై ఆనకట్టలు నిర్మించింది
– ద్రావిడులు

– కె. నాగార్జున
కరెంట్‌ ఎఫైర్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ
9490352545 

Spread the love