కరెంట్‌ అఫైర్స్‌

Current Affairsరసాయన శాస్త్రంలో నోబెల్‌ బహుమతి
మౌంగి జి.బావెండి, లూయిస్‌ ఇబ్రూస్‌, అకెక్సి ఐ.ఎకిమోవ్‌ లకు ”క్వాంటమ్‌ చుక్కలు ఆవిష్కరణ మరియు సంశ్లేషణ కోసం” రసాయన శాస్త్రంలో నోబెల్‌ బహుమతి 2023 క్వాంటమ్‌ డాట్స్‌ నానో పార్టికల్స్‌ ఆవిష్క రణకు లభించింది. వీరి పరిశోధన ఎల్‌ఇడి దీపాల నుంచి తమ కాంతిని వ్యాప్తి చేయడానికి, కణితి కణజాలాన్ని తొలగించడానికి శస్త్ర చికిత్సలో మార్గ నిర్ధేశం చేస్తాయి.
డచ్‌ స్పినోజా ప్రైజ్‌ – జోయితా గుప్తా
ఆమ్‌స్టర్‌ డ్యామ్‌ విశ్వవిద్యాలయం లో భారతీయ సంతతికి చెందిన ప్రొఫె సర్‌ డాక్టర్‌ జోయితా గుప్తా వాతావరణ మార్పులు రంగంలో ఆమె చేసిన కృషికి ప్రతిష్టాత్మకమైన డచ్‌ స్పినోజా బహు మతిని పొందింది. డా.గుప్తా ఈ పరి శోధన, విజ్ఞాన వినియోగాన్ని మరింతగా పెంచడానికి కేటాయించాలని తన ఉద్ద్యేశాన్ని వ్యక్తం చేసింది. డా.జోయితా గుప్తా ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న అమ్‌ స్టర్‌డ్యామ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన 12వ పరిశోధకురాలు.
దివ్యాంగుల కోసం  హైటెక్‌ స్పోర్ట్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మాజీ ప్రధాని శ్రీ అటల్‌ బిహరీ వాజ్‌పేయి పేరు మీద దివ్యాంగుల కోసం దేశంలోనే మొట్టమొదటి హైటెక్‌ క్రీడా శిక్షణా కేంద్రాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. దివ్యాంగ్‌ స్టోర్ట్స్‌ కోసం అటల్‌ బిహారీ ట్రైనింగ్‌ సెంటర్‌లో దేశం నలుమూలల నుంచి దివ్యాం గజనులు ప్రాక్టీస్‌ చేయవచ్చు, శిక్షణ పొందవచ్చును. దీనిని అక్టోబర్‌ 2న ప్రారంభించారు. దీనికోసం కేంద్రం ఏర్పాటు చేసిన 34 ఎకరాల విస్తీర్ణంలో 151.16 కోట్ల బడ్జెట్‌ను మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
రిలయన్స్‌ జియోమార్ట్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ దోని
రిలయన్స్‌ రిటైల్‌కు చెందిన జియోమార్ట్‌ భారతదేశపు అత్యంత దిగ్గజ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీని తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకొంది. రిలయన్స్‌ అక్టోబర్‌ 08న జియో ఉత్సవ్‌ను ప్రచారం చేయబోతుంది. దీని ద్వారా భారతదేశ శక్తివంతమైన సంస్కృతి దాని ప్రజలు దేశ క్యాలెండర్‌ను సూచించే వివిధ పండుగలతో రూపొందించడం జరిగింది. ఈ పండుగలలో షాపింగ్‌ అనేది అంతర్భాంగం అని షాపింగ్‌ అవసరాలు జియోమార్ట్‌ను వేదికగా పేర్కొంది.
– కె. నాగార్జున
కరెంట్‌ ఎఫైర్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ
9490352545 

Spread the love