కరెంట్‌ అఫైర్స్‌

Current Affairsఎడాప్ట్‌ ఎ హెరిటేజ్‌ 2.0 కార్యక్రమం : భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, దాని అమూల్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి ఎ.ఎస్‌.ఐ (ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) 2023 సెప్టెంబర్‌ 4 న అంటే ఈ రోజు న్యూ ఢిల్లీలో ఐ.డి.ఎన్‌.సి.ఎ. లోని ఆడిటోరియంలో ‘అడాప్ట్‌ ఎ హెరిటేజ్‌ 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇదే రోజు ‘ఇండియన్‌ హెరిటేజ్‌’ పేరుతో మొబైల్‌ యాప్‌ను ప్రారంభించనున్నారు.
బ్రిక్స్‌ కూటమిలో మరో 6 దేశాలు : అర్జెంటినా, ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇరాన్‌, సౌదీ అరేబియా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది. దక్షిణాఫ్రికాలో జొహన్నెస్‌ బర్డ్‌ లో జరుగుతున్న 3 రోజుల శిఖరాగ్ర భేటీలో ఆఖరు రోజైన సిరిల్‌ రమఫోనా ప్రకటించారు. 2024 జనవరి 1 వ తేదీ నుంచి 6 దేశాల సభ్యత్వం అమలులోకి వస్తుందని తెలిపారు. ఇక నుంచి బ్రిక్స్‌ బలం 5 నుంచి 11 కు పెరగనుంది.
అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్‌ – శక్తికాంత దాస్‌ : అంతర్జాతీయంగా అత్యుత్తమ కేంద్రబ్యాంకర్‌గా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌.బి.ఐ) గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ నిలిచారు. అమెరికాకు చెందిన గ్లోబల్‌ ఫైనాన్స్‌ మ్యాగజైన్‌ ఇచ్చిన ర్యాంకుల్లో ఆయనకు అగ్రస్థానం దక్కింది. ‘గ్లోబల్‌ ఫైనాన్స్‌ సెంట్రల్‌ బ్యాంకర్‌ రిపోర్ట్‌ కార్డ్స్‌ 2023 లో శక్తికాంత దాస్‌కు ‘ఎ +’ రేటింగ్‌ లభించింది. ఈ ఎ + రేటింగ్‌ ముగ్గురు కేంద్ర బ్యాంక్‌ గవర్నర్స్‌కు ఇవ్వగా అందుకు శక్తికాంత దాస్‌ అగ్రస్థానం పొందారు. తరువాతి స్థానం స్విట్జర్లాండ్‌ (స్విస్‌ సెంట్రల్‌ బ్యాంక్‌) గవర్నర్‌ థామస్‌ జె.బోర్టాన్‌, వియత్నాం కేంద్ర బ్యాంకు అధిపతి ఎన్‌గుయెన్‌ థిహంగ్‌ వున్నారు.
జార్జియాలో ‘హిందూ వారసత్వ’ నెలగా అక్టోబర్‌ : మహాత్మాగాంధీ జయంతి తో పాటు శరన్నవరాత్రులు, దీపావళి వంటి ప్రముఖ పండుగలు వున్న అక్టోబర్‌ను అమెరికాలో జార్జియా రాష్ట్రం హిందూ వారతస్వ నెలగా ప్రకటించింది. ప్రతిభావంతులైన హిందూ – అమెరికన్లను గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్‌ బ్రయాన్‌ కెంప్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలలో హిందు సాంప్రదాయ ఆద్యాత్మిక కార్యక్రమాల నిర్వహణపై దృష్టి పెడతామని పేర్కొన్నారు.
మట్టి అరటి రకానికి జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ ట్యాగ్‌ : కన్యాకుమారి జిల్లాకు చెందిన మట్టి అరటి రకానికి ఇటీవల భౌగోళిక సూచిక (జి.1) ట్యాగ్‌ లభించింది. ఈ మట్టి అరటి రకాలను ‘బేబీ బనానా’ అని పిలుస్తారు. ఈ రకం శిశువు ఆహారంగా సిఫార్సు చేయడం జరిగింది. ఈ జి1 ట్యాగ్‌ 10 సంవత్సరాల వరకు చెల్లుబాటులో వుంటుంది.
గబోన్‌ లో సైనిక తిరుగుబాటు : ఆఫ్రికాలో మరో సైనిక తిరుగుబాటు జరిగింది. అధ్యక్షుడు ఆలీ బాంగోను గబోన్‌లో సైనికులు గృహనిర్భందంలో పెట్టి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. దేశ సరిహద్దులను మూసివేశారు. కొత్త పాలకుడిగా జనరల్‌ బ్రైన్‌ క్లొటైర్‌ ఒలిగు గుయేమాను ఎన్నుకొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆలీ బాంగో 64 శాతం ఓట్లతో నెగ్గారు. అయితే ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదని సైనిక తిరుగుబాటుతో ఆరోపించింది. సైనికులు జాతీయ టెలివిజన్‌లో ఈ విషయం ప్రకటించగానే ప్రజలు వీధుల్లోకి వచ్చి సంఘీభావం తెలిపారు.
ఇండోనేషియాలో 7 దేశాల సైనిక విన్యాసాలు : ఇండోనేషియా ప్రధాన దీవి జావాలో అమెరికాతో సహా 7 దేశాల సైనికుల వార్షిక విన్యాసాలు మొదలయ్యాయి. అమెరికా ఇండోనేషియా దేశాలు సైనిక వార్షిక విన్యాసాలను 2009 నుంచి నిర్వహిస్తున్నాయి. గత ఏడాది ఆస్ట్రేలియా, జపాన్‌, సింగపూర్‌ జత కలిశాయి. 2 వారాల పాటు జరగనున్న ఈ విన్యాసాలకు భారత సహ 12 దేశాలు తమ పరిశీలకులను పంపాయి. మొత్తం 19 దేశాలు భాగస్వామ్యం వున్న ఈ శిక్షణ విన్యాసాలు ఇండో – పసిఫిక్‌ ప్రాంత రక్షణకు సంఘీభావ ప్రదర్శన గా పేర్కొంటారు.
భారతదేశపు మొట్టమొదటి యు.పి.ఐ – ఎ.టి.ఎమ్‌ : జపాన్‌ ఆధారిత హిటాచి లిమిటెడ్‌ అనుబంధ సంస్థ అయిన హిటాచి పేమెంట్‌ సర్వీస్‌. నేషనల్‌ పేపెంట్స్‌ కార్పొరేషన్‌తో కలిసి హిటాచి మని స్పాట్‌ (యు.పి.ఐ ఎ.టి.ఎమ్‌) పేరుతో భారతదేశపు మొట్టమొదటి యు.పి.ఐ – ఎ.టి.ఎమ్‌ ను వైట్‌ లేబుల్‌ ఎ.టి.ఎమ్‌ (డబ్యు.ఎల్‌.ఎ) గా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇదికార్డ్‌లెస్‌ నగదు ఉపసంహరణలను అందిస్తుంది. యు.పి.ఐ -ఎ.టి.ఎమ్‌ వినియోగదారులు యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ ఫేస్‌ (యు.పి.ఐ) యాప్‌ని ఉపయోగించి నగదు ఉపసంహరణ చేసుకోవచ్చును.
– కె. నాగార్జున
కరెంట్‌ ఎఫైర్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ
9490352545

Spread the love