కరెంట్‌ అఫైర్స్‌

Current Affairsగ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ 2023లో 40వ స్థానంలో భారత్‌
జెనివా కేంద్రంగా పని చేస్తున్న వరల్డ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూఐపిఓ) ప్రకటించిన గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ 2023లో వరుసగా 13వ ఏడాది స్విట్జర్లాండ్‌ మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో స్వీడన్‌, యునైటెడ్‌ స్టేట్స్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, సింగపూర్‌లు ఉన్నాయి. చైనా 12, జపాన్‌ 13, భారత్‌ 40వ స్థానాల్లో ఉన్నాయి. చివరి స్థానంలో అంగోలా నిలిచింది.
దేశంలోనే మొదటి కార్టోగ్రఫీ మ్యూజియం
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్‌లో ముస్సోరిలోని జార్జ్‌ ఎవరెస్ట్‌ కార్టోగ్రఫీ మ్యూజియంను ఉత్తరాఖండ్‌ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి సత్పాల్‌ ముషరాజ్‌ ప్రారంభించారు. కార్టోగ్రఫీ అంటే మ్యాపులను అన్వేషించడం.
అత్యంత వేడి వేసవిగా 2023
1880 నుంచి వాతావరణ వివరాలు నమోదు గణాంకాలు చూస్తే 2023 అత్యంత వేడి కల్గినదిగా రికార్డు సృష్టించింది. ఈ గణాంకాలు న్యూయార్క్‌లోని నాసాకు చెందిన గోడార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ వెల్లడించింది. ఇప్పటికైనా మేలుకొని గ్లోబల్‌ వార్మింగ్‌కు, పర్యావరణ విధ్వంసానికి అడ్డుకట్ట వేయడం ప్రపంచ దేశాల ముదున్న తక్షణ కర్తవ్యం అని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కమిరిటా షెర్పా కొత్త రికార్డు
నేపాల్‌ పర్వతారోహకుడు కమి రిటా షెర్పా (53) సరికొత్త ప్రపంచరికార్డు నెలకొల్పారు. ఎనిమిది వేల మీటర్ల ఎత్త యిన పర్వత శిఖరాలను 42 సార్లు అధిరోహించిన ఘన తను ఆయన సాధించారు. 41 సార్లు అదిరో హించిన నిమ్స్‌ పుర్జా పేరిట ఉన్న రికా ర్డును కమిరిటా బద్దలు కొట్టారు. ప్రపంచంలో ఎనిమిదవ ఎత్తైన మౌంట్‌ మనస్లును మంగళవారం ఉదయం కమిరిటా షెర్పా అదిరో హించారని సెవెన్‌ సమిట్‌ ట్రెక్స్‌ అనే పర్వతారోహక సంస్థ తెల్పింది.
ఫ్లేవర్‌ ఆఫ్‌ ఇండియా ది ఫైన్‌ కప్‌
అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఆదివాసీ మహిళా రైతు కిల్లో అశ్విని ఇటీవల బెంగుళూరులో జరిగిన మూడు రోజుల ప్రపంచ కాఫీ సదస్సు – 2023లో గుర్తింపు, ప్రశంసలు పొందారు. ప్యానెల్‌లోని న్యాయ మూర్తులు అశ్విని పండించిన కాఫీ గింజలపై ప్రశంసలు కురిపించారు. ఇందులో మన ప్రాంతానికి చెందిన 124 మంది గిరిజన రైతులు తమ పార్చ్‌మెంట్‌ కాఫీ గింజల నమూనాలను ప్రదర్శించారు. అయితే అశ్విని పండించిన కాఫీ గింజలు టాప్‌ ర్యాంక్‌ పొందాయి. ఈ విజయానికి గుర్తింపు అశ్వినిని ప్రతిష్టాత్మక ‘ఫ్లేవర్‌ ఆఫ్‌ ఇండియా ది ఫైన్‌ కప్‌ అవార్డు – 2023’తో సత్కరించారు.
రేపాకకు గుర్రం జాషువా జాతీయ పురస్కారం
అభ్యుదయ రచయితల సంఘం ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి రేపాక రఘునందన్‌కు ఆంధ్రప్రదేశ్‌ బహుజన రచయితల వేదిక గుర్రం జాషువా జాతీయ సాహితీ పురస్కారంకు ఎంపిక చేసింది. రేపాక తెలుగు, హిందీ భాషలలో పలు రచనలు చేయడంతో పాటు ప్రతిజ్ఞ (భారత దేశం నా మాతృభూమి) రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్రను రచించారు.

Spread the love