వినికిడి లోపం నివారణ- ఆడియాలజిస్ట్‌ల పాత్ర

Prevention of hearing loss- role of audiologistsమనిషి శరీరంలో జ్ఞానేంద్రియాలు అతి ముఖ్యమైనవి. ఒక్కొక్క జ్ఞానేంద్రియం ఒక్కొక్క రకమైన పనిచేస్తూ సమాజంలో మనిషి మనుగడకు దోహద పడుతున్నవి. కండ్లు చూడడానికి దోహదపడతే, చెవులు వినడానికి ఉపయోగపడుతున్నవి. మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన కండ్లకు, చెవులకు ప్రాధాన్యత నివ్వడంలో నేటి సమాజం నిర్లక్ష్యం చేస్తుంది. ఈ నిర్లక్ష్యం ఫలితంగా సమా జంలో వినికిడి శక్తి లోపం పెరుగుతుంది. ఆడియాలజీ (లాటిన్‌ ఆడియర్‌ నుండి, ”వినడానికి”, గ్రీక్‌ -లోజియా నుండి) ఏర్పడినది. ప్రతి యేటా అక్టోబర్‌ 10న అంత ర్జాతీయ ఆడియాలజిస్టు దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది వినికిడి సమతుల్యత, వినికిడి సంబంధిత రుగ్మతలను అధ్య యనం చేస్తుంది. ఆడియాలజిస్టులు వినికిడి లోపం ఉన్న వారిని గుర్తించి చికిత్స చేస్తారు. వినికిడి లోపం వల్ల జరిగే నష్టాన్ని నివారించేందుకు ఆడి యాలజిస్టులు కీలకపాత్ర పోషిస్తున్నారు. వినికిడి లోపం నిర్ధారణ అయిన తరువాత ఆడియాలజిస్టులు వినికిడి శక్తి లోపం తీవ్రతను బట్టి ఏ పరికరాలను వినియోగిం చాలేనో నిర్ణయిస్తారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వినికిడి లోపం రోజురోజుకు పెరుగు తుంది. మనదేశంలో 15 నుంచి 20 శాతం మంది వినికిడి, మాట సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఏదో ఒక రకమైన వినికిడి సమస్యతో బాధపడే వారి సంఖ్య 10 శాతం వరకు ఉంటుందని అంచనా. 2 లక్షల మంది విద్యార్థులు వినికిడి సమస్య కలిగి ఉన్నారనీ అంచనా. కరోనా పరిస్థితుల అనంతరం 50 ఏండ్ల వయసు పైబడిన వారిలో వినికిడి లోపం తీవ్రత అధికమవుతుంది. 2050 నాటికి వినికిడి సమస్య తీవ్రత పెరిగి ప్రతి నలుగురిలో ఒకరికి వినికిడి లోపం ఏర్పడుతుందని 2021లో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన గణాంకాలు పేర్కొంటున్నాయి.
సమాజంలో ఆడియాలజిస్ట్‌ పాత్ర
శ్రవణ, వెస్టిబ్యులర్‌ సిస్టమ్స్‌ రుగ్మతలను గుర్తించడం, నిర్ధారణ చేయడం, చికిత్స చేయడం, పర్య వేక్షించడంలో నైపుణ్యం కలిగిన ఆరోగ్య సంరక్షణకు అవసరమైన సూచనలు జాగ్రత్తలు చెప్పే నిపుణుడే ఆడియో లజిస్ట్‌. వినికిడి సమతుల్య సమస్యలను గుర్తించడానికి, చికిత్స చేయడానికి ఆడియాల జిస్ట్‌లు కృషి చేస్తున్నారు. శిశువులలో వినికిడి లోపం నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా వినికిడి శక్తి లోపం విస్తరించకుండా అరికట్ట వచ్చు. వినికిడి లోపం గుర్తించడంలో ఆలస్యం అయితే వినికిడి లోపం కలి గిన పెద్దలకు కోపింగ్‌, నైపుణ్యాలను నేర్పించడంలో సహాయపడతారు. సహాయ పరికరాల రూపకల్పన, వ్యక్తిగత, పారిశ్రామిక వినికిడి భద్రత కార్యక్రమాలు, నవజాత శిశువులకు వినికిడి స్క్రీనింగ్‌ కార్యక్రమాలు, పాఠ శాలలో విని కిడి స్క్రీనింగ్‌ ప్రోగ్రామ్‌లు, వినికిడి లోపం నష్టాన్ని నివారించడానికి సహాయపడే ప్రత్యేక లేదా అనుకూలంగా అమర్చిన ఇయర్‌ ప్లగ్‌లు ఇతర వినికిడి రక్షణ పరిక రాలను అందించాలి. లోపలి చెవి వెస్టిబ్యులర్‌ భాగం పాథాలజీల నుండి ఉత్పన్నమయ్యే పరిధీయ వెస్టిబ్యులర్‌ రుగ్మతలు అంచనా వేయడానికి శిక్షణ పొందిన ఆడియాల జిస్టులు అవసరం. బెనిగ్న్‌ పరో క్సిమల్‌ పొజిషనల్‌ వెర్టిగో వంటి కొన్ని వెస్టి బ్యులర్‌, బ్యాలెన్స్‌ డిజార్డర్‌లకు చికి త్సను అందిస్తారు. ఆడియాలజి స్టులు నియోనాటల్‌ హియరింగ్‌ స్క్రీనింగ్‌ ప్రోగ్రామ్‌ను కూడా అమలు చేస్తున్నారు. ఇది యుఎస్‌, యుకె, భారతదేశంలోని అనేక ఆసుపత్రులలో తప్పనిసరి చేయబడింది. 2018లో కెరీర్‌ కాస్ట్‌ నివేదిక సర్వే ప్రకారం మూడవ అతి తక్కువ ఒత్తిడితో కూడిన ఉద్యోగం ఆడియాలజిస్ట్‌ వృత్తి. ఈ వృత్తిని ఎంచుకోవడం ద్వారా సమాజానికి మేలు చేయడానికి నేటి తరం యువత ముందుకు రావాలి.
ఆడియాలజిస్ట్‌ అనే పదం 1946లో వాడుకలోకి వచ్చింది. ఈ పదం సృష్టికర్త తెలియదు, కానీ బెర్గర్‌, మేయర్‌, షియర్‌, విల్లార్డ్‌, హార్గ్రేవ్‌, కాన్ఫీల్డ్‌ రాబర్ట్‌ గాలాంబోస్‌ జీవిత చరిత్రలో హాలోవెల్‌ డేవిస్‌ 1940లలో ఈ పదాన్ని ఉప యోగించిన ఘనత పొందాడు. ఆ సమయంలో సమాజంలో అత్యధికంగా ఉన్న ”ఆరిక్యులర్‌ ట్రైనింగ్‌” అనే పదం ప్రజలకు చెవులు ఎలా కదిలించాలో నేర్పించే పద్ధతి. నార్త్‌ వెస్ట్రన్‌ యూనివర్సిటీలో ఆడియోలజిస్ట్‌ల కోసం మొదటి యుఎస్‌ యూనివర్సిటీ కోర్సు 1946లో అందించబడినది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో గణనీయంగ వినికిడి లోపం ఏర్పడినది. ఆడియాలజీ ఇంటర్నేషనల్‌ సొసైటీ 1952లో స్థాపించబడిన తరువాతనే వినికిడి శక్తి నివారణకు తీసుకో వలసిన చర్యలపై సైంటిఫిక్‌ పీర్‌-రివ్యూడ్‌ ఇంటర్నే షనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఆడియాలజీ ప్రచురణల ద్వారా జాతీయ సంఘాలు, సంస్థల మధ్య పరస్పర సంబంధం ఏర్పడినది. వినికిడి లోపం ఉన్న వారికి అవసర మైన సహాయం అందించేందుకు, వినికిడి లోపం, చెవిటి వారి అవసరాలను తీర్చ డానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరంతరం కృషి చేస్తుంది.
చేయాల్సిన కృషి
వినికిడి సమస్యలను నివారించ డానికి, సమస్యలు ఉన్నవారిని శాస్త్రీయం గా గుర్తించి తగు చికిత్సలు అందించ డానికి అవగాహన ఉన్న స్పెషల్‌ డాక్టర్స్‌ అయిన ఆడియాలజిస్టులు మాత్రమే చేయగలరు. కానీ మన దేశంలో ఆడియాలజిస్టు డాక్టర్స్‌ అంటే ఎవరో సాధారణ ప్రజల్లో అంతగా అవగాహన లేదు. ఎందుకంటే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో ప్రతి 5 లక్షల మందికి ఒక ఆడియాలజిస్ట్‌ మాత్రమే ఉన్నారు. అభివృధి చెందిన దేశాల్లో 33 కోట్ల మంది ప్రజలకు 2 లక్షల మంది ఆడియాలజి స్టులు ఉంటే ఇండియాలో 140 కోట్ల మంది ప్రజ లకు కేవలం 5000 మంది మాత్రమే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలకు అను బంధంగా ఆడియాలజిస్టు కళాశాలలు ఏర్పాటు చేయాలి. అన్ని మెడికల్‌ కాలేజీలు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులలో శిక్షణ పొందిన ఆడియాలజిస్టులను నియమించాలి. పుట్టిన ప్రతి శిశువుకు 24గంటల లోపు వినికిడి పరీక్షలు చేయించాలి. పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులకు ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా వినికిడి పరీక్షలు చేయించాలి. వినికిడి సమస్య గుర్తించిన విద్యార్థులందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ఉచితంగా మిషన్స్‌ సరఫరా చేయాలి. ఆరోగ్యశ్రీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకు వారి కుటుంబసభ్యులకు వైద్యం చేయడానికి ఆడియాల జిస్టుల క్లినిక్‌లను యంఫ్యానల్‌ చేసుకొని, వినికిడి సమస్యతో బాధపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు వినికిడి మిషన్లు కొనుక్కోడానికి అవసరమైన పూర్తి ఆర్థిక సహాయం చేయాలి. వినికిడి సమస్యతో బాధ పడుతున్న పేదలకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా నాణ్యమైన వినికిడి మిషన్లు అందించాలి.
పుట్టుకతోనే వినికిడి సమస్య ఉంటే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ చేయాల్సిన అవసరమున్న చిన్నారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేస్తున్న కాక్లియార్‌ ఇంప్లాంటేషన్‌ ఆపరేషన్‌ వినియోగించు కోవాలి. మాటలు రాని మూగ వారికి స్పిచ్‌ థేరపి కేంద్రాలను ప్రభుత్వము ఏర్పాటు చేయాలి. అంతర్జాతీయ ఆడియాలజిస్ట్‌ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ అవగా హన పెంచుకోవాల్సిన అవసరం ఉంది

(అక్టోబర్‌ 10న అంతర్జాతీయ ఆడియలజిస్ట్‌ డే)
యం. అడివయ్య 9490098713

Spread the love