ఒకావిడ తన ఇంట్లో కొండ చిలువను పెంచుకుంది. ప్రతిరోజూ ఆహారం పెట్టేది. దానితో ఆటలాడేది. ఎంతో చనువుగా ఉండేది. ఎక్కువసేపు ముచ్చటించేది. కొద్ది రోజుల్లోనే ఆ పాముతో ఆమెకు విడదీయరాని బంధం ఏర్పడింది. ఇంట్లో కుటుంబ సభ్యునిలాగే దాన్ని కూడా చూసుకునేది. అయితే ఉన్నట్టుండి ఒకరోజు సడెన్‌గా అది ఆహారం తినడం మానేసింది. ఎక్కువసేపు ఆమెను అల్లుకునే ఉండేది. ఇలా వారం గడిచింది. అది బక్కచిక్కు తోందని గ్రహించి దాన్ని వైద్యుని దగ్గరకు తీసుకెళ్లింది. పామును గమనించిన అతను దాన్నుంచి ఏదో పసిగట్టాడు. ‘అది ఆహారం తినకుండా ఎందుకుంటుందో తెలుసా? అని అడిగాడు. ఆమెకు అర్థం కాలేదు. ‘ఏదో ఓరోజు నిన్నే తిని ఆకలి తీర్చుకుందామని ఇన్ని రోజులు ఉపవాసంగా ఉంటోంది’ అని చెప్పాడు. ‘నీతో అల్లుకోని ఎందుకు పడుకుంటుందో తెలుసా?’ అన్నాడు. ‘నీ ఎముకలు విరగ్గొట్టే శక్తి తనకుందా లేదా అని పరీక్షిం చుకుంటుంది’. అన్నాడు. ప్రేమతో ముద్డాడేది ఎందుకో తెలుసా? ‘నిన్ను అమాంతం మింగితే కడుపులో పడతావా లేదా?’ అని అన్నాడు…
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దేశంలో బీజేపీ-ఆరెస్సెస్ చేపట్టిన విధ్వంసపు రచన నేను చెప్పిన కథకు అద్దం పట్టేలా ఉంది. భావజాల రంగంలో విస్తరిస్తున్నకొద్దీ దాని అసలు రంగు బయట పడుతోంది. ముందుగా ప్రజలంటే ప్రేమగా నటిస్తూనే అంతర్గతంగా ఆరెస్సెస్ భావజాలాన్ని విస్తరింపజేస్తోంది. దీనికి ఎన్నికలకు ముందే తన హిందూత్వ ప్లాన్ అమలుకు కొన్ని ఈశాన్య రాష్ట్రాలను ప్రయోగ శాలలుగా ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి దేశంలోకి విద్వేషపు మంటల్ని రెచ్చగొడుతోంది. మణిపూర్‌లో ఇద్దరు కుకీ మహిళలపై జరిగిన లైంగికదాడి, హత్యదేశాన్నే కాదు యావత్ ప్రపం చాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. మూడునెలలుగా మారణకాండ అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంది.ముందు మనకు ఇది కుకీ, మైతేయి వర్గాల రిజర్వేషన్ వివాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. కానీ ఇది మతశక్తుల దుష్ట పన్నాగం! ఇందులో మరో కుట్రకోణం దాగుంది! మైతేయిలకు ఎస్టీ హోదా ద్వారా కొండ ప్రాంతాల్లో భూమిని కార్పొ రేట్లకు ధారాదత్తం చేయడం. ప్రస్తుతానికి కుకీలకే ఆ భూములపై హక్కుంది గనుక ఆధిపత్యం ఉన్న మైతేయి లకు ఎస్టీ హోదా కల్పిస్తే వారు ఆ భూముల్లోని వనరులు, ఖనిజ సంపదకు వారసుల్ని చేయాలనేది వారి ప్రణాళికలో అంతర్భాగంగా కనిపిస్తోంది. ఆ వర్గానికి చెందిన అక్కడి ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ పావులు కదిపారు. ముందు జాతుల మధ్య ఘర్షణగా చేసిన ప్రయ త్నాలు ఫలించలేదు. వారు ఖనిజ సంపదను కొల్లగొట్టాలంటే కుకీలు కొండ ప్రాంతాల్ని ఖాళీ చేయాలి. అందుకు ముందు వారిని మయన్మార్ నుంచి వచ్చిన వలసదారులుగా చిత్రీకరించి వారిపై దాడులకు మైతేయిల్ని తెగబడేలా చేశారు. ఇండ్లు ధ్వంసం చేశారు, చర్చీలు తగలబెట్టారు .ఇలా కుకీల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినేలా చేద్దామనుకున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు కాని ఈ అరాచకాలను అదుపు చేయలేదు. ఎందుకంటే అధి కారులు, పోలీ సుల్లో చాలామంది మైతేయి వర్గానికి చెందినవారే. అందుకే ఎంతో మంది కుకీలు హత్యకు గురవుతున్నా వారు మాట్లాడటం లేదు. ఇండ్లు, చర్చీలు దగ్ధమవుతున్నా ఆపడం లేదు.
అయినా కాషాయ పరివారం అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. ఆ భూముల కోసం మరో పథకం వేశాడు విశ్వగురు. ఎందు కంటే రాజకీయ విద్యలో ఆరితేరిన సుప్రసిద్ధుడనే పేరు సార్థకం చేసు కున్నాడు కదా! సులభంగా ఆటవీ భూముల రక్షణ చట్టానికి సవరణ చేశాడు. పార్లమెంట్‌లో మందబలంతో ఆమెదించుకున్నాడు. చట్టం ఇప్పుడు మణిపూర్ చుట్టు పక్కల వంద కిలో మీటర్ల ఆడవులన్నీ కేంద్రం ఎవరికైనా కట్టబెట్టుకునే వీలును కల్పించింది. అయితే వారి ప్రయోగశాలల్లో చేసిన కుట్రలతో వారిలో ఒక ఆశాభావం ఏర్పడింది. మతం మంటల్లో చలికాచుకునే పరిస్థితి దేశంలో ఉందని! విద్వేషపు రాజకీయాలతో ప్రజల్ని విడదీసే స్వేచ్ఛ ఉందని! అందుకే ఆస్తులు ధ్వంసమైనా, ప్రాణాలు పోయినా, ఆదుకోవాలని చేసిన ఆర్తనాదాలు మౌనమునికి వినపడలేదు. కనపడలేదు. అది ఆరుతుందనుకునే సమయంలోనే హర్యానాలో హిందూ,ముస్లింల ఘర్షణకు మరో బీజం పడింది. కానీ ఇంతవరకు ఘర్షణలు జరిగిన రెండు రాష్ట్రాల్లో ప్రజల్ని పాలిస్తున్నవి, విభజిస్తున్నవి డబులింజన్ సర్కార్లే అన్న సంగతి మరవకూడదు. గోద్రా అల్లర్లు మానవత్వాన్ని మంటకలిపాయి. కాశ్మీరీపండిట్లు, ముస్లింల మధ్య ఘర్షణ జమ్మూకాశ్మీర్‌ను విభ జించాయి. తాజాగా మణిపూర్ మండుతూనే ఉండగానే హర్యానాలో మత చిచ్చు రగిలింది. ఇదంతా పథకం ప్రకారమే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. దేశాన్ని ‘హిందూత్వ’గా మార్చాడానికి బీజేపీ-ఆరెస్సెస్ చేపట్టిన ఆరచాకాలే ఇవన్నీ! రేపు ఏ రాష్ట్రం, ఏరూపంలో మండు తుందో చెప్పలేం! కానీ దేశంలో రాజకీయ పరిస్థితులు తారు మారవు తున్న కొద్దీ విధ్వంసపు కుట్ర శరవేగంగా అమలు చేసే ప్రయత్నం జరుగుతున్నది!
ఈశాన్య భారతంలో కాషాయ దండును తయారుచేసి, హిందూత్వ ఉద్యమంగా రూపు దిద్ద డానికి ఆరెస్సెస్ పక్కాప్లాన్‌నే హిందూత్వ శక్తులు నేడు అమలు చేస్తున్నట్టు సమాచారం. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన తరువాత హిందూత్వ సంస్థలు తమ కార్యకలాపాలను మరింత ఉధృతం చేశాయి. 2015లో మణిపూర్ అసెంబ్లీలో రెండు సీట్లు గెలుచుకున్న బీజేపీ 2017లో ఏకంగా అధి కారాన్నే చేజిక్కించుకుంది. మెయితీలను హిందూ జాతీయ వాదులుగా మార్చేందుకు వైష్ణవాన్ని ప్రోత్సహించింది. తమిళనాడులో హిందీని రుద్దాలని చూసింది. ఇలా అన్నిచోట్ల ఏదో రకంగా పాగావేయాలని చేసే ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి. మతపాలనను అన్నిరాష్ట్రాల్లో ప్రజలు స్వీకరించే స్థితిలో లేరు. దేశంలో కాషాయ పార్టీకి ఉన్న బలం ముప్తై ఎనిమిది శాతం ఓటింగ్ మాత్రమే. వారు స్వతహాగా గెలుచుకున్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, గుజరాత్, మణిపూర్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, త్రిపుర. కొన్ని రాష్ట్రాలను కూటములతో, మరికొన్ని ంటిని ప్రజాస్వామ్య బద్ధంగా గెలిచినవాటిని పడగొట్టి పాలిస్తున్నవి. మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలున్నాయి. అయితే హిందూత్వ నినాదం ఎత్తుకున్న పెద్దలకు ఇది ఏమాత్రం మింగుడు పడటం లేదు. అంతెం దుకు దేశ రాజధాని ఢిల్లీని వారి చేతుల్లోకి తీసుకోవడానికి చేస్తున్న ఏకపక్ష నిర్ణయాలు ఎవరికీ తెలియనివి కావు. పాలనాధికారాలను వారి చెప్పుచేతుల్లో ఉంచుకోవడానికి ఆర్డినెన్స్‌లు, కొత్త జీవోలతో అక్కడి ప్రభు త్వాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. దేశమంతా మత, విభజన రాజకీయాలతో పాలన సాగించాలని చూస్తోంది. రెండో సారి జవాన్లపై పుల్వామా దాడిని బూచిగా చూపి, పాకిస్తాన్ నుంచి దేశానికి ప్రమాదం ఉందని చెప్పి ప్రజల్ని ఏమార్చి గెలిచింది. ఇప్పు డూ తమ హిందూత్వ ప్రయోగశాలల ద్వారా అల్లర్లు, విధ్వంసాలు సృష్టించి మరోసారి అధి కారంలోకి రావాలని చూస్తోంది! ఇప్పటికే హక్కులు హననమ య్యాయి. భరిస్తూ వస్తున్నాం.విలువలు బుగ్గ య్యాయి పోరాడు తూనే ఉన్నాం. కానీ మనం పీల్చుకునే ఊపిరిలో మతగాలులు వీస్తున్నాయి. పీల్చితే విద్వేషపు మంటల్లో చిక్కుకుని చచ్చిపోతాం. పీల్చకుంటే బతకలేమో అనే పరిస్థితిని సంఫ్‌ుపరివార్ సృష్టిస్తోంది. ఇది ప్రజలు గమనించకుంటే పైన పాము మహిళను ఎలా బలి గొనాలని ఆలోచిస్తుందో…వారు అనుకున్నది సాధించ డానికి దేశాన్నే కాషాయపు రంగులో ముంచే ప్రమాదం పొంచి ఉంది. అందుకే దేశానికి ఇప్పుడు అప్రమత్తత అవసరం.
ఎన్. అజరుకుమార్