కరెంట్‌ అఫైర్స్‌

Current Affairsనోబెల్‌ పురస్కారం నగదు పెంపు
నోబెల్‌ బహుమతి గ్రహీతలకు ఇచ్చే నగదు మొత్తాన్ని ప్రస్తుతమున్న ఒక మిలియన్‌ క్రొనార్ల (74.80 లక్షల రూపాయలు) నుండి 11 మిలియన్ల క్రొనార్ల (8.15 కోట్ల రూపాయలు) కు పెంచుతున్నట్లు నోబెల్‌ ఫౌండేషన్‌ శుక్రవారం ప్రకటించింది. 1901 లో మొదటిసారి ప్రదానం చేసినప్పుడు ఒక్కో కేటగిరికి 1.50 లక్షల క్రోనార్లు అందజేసింది. తరువాత నోబెల్‌ ఫౌండేషన్‌ ఈ మొత్తాన్ని పెంచుతూ వస్తోంది. ఈ ఏడాది నోబెల్‌ విజేతలను అక్టోబర్‌లో ప్రకటించనుంది.
రజనీకాంత్‌కు ప్రపంచ కప్‌ గోల్డెన్‌ టికెట్‌
భారత్‌ వేదికగా వన్డే ప్రపంచ కప్‌ మరో 15 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేక చొరవ తీసుకుంది. భారత్‌లోని దిగ్గజాలకు ప్రత్యేక టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘గోల్డెన్‌ టికెట్‌ ఫర్‌ ఇండియా ఐకాన్స్‌’ అని పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్ట్ణ్పటికే అమితాబ్‌ బచ్చన్‌, సచిన్‌లకు ఈ గోల్డెన్‌ టికెట్‌ను అందజేసింది. తాజాకు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌కు వన్డే ప్రపంచకప్‌ – 2023 గోల్డెన్‌ టికెట్‌ను బీసీసీఐ కార్యదర్శి జైషా నేరుగా వెళ్లి ఈ టికెట్‌ను అందించారు
స్వాతినాయక్‌కు నార్మన్‌ బోర్లాగ్‌ అవార్డు
ప్రతిష్టాత్మక నార్మన్‌ బోర్లాగ్‌ – 2023 అవార్డుకు భారతీయ శాస్త్రవేత్త, డాక్టర్‌ స్వాతి నాయక్‌ ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్‌ రైస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఆర్‌ఆర్‌ఐ) లో పని చేస్తున్న ఆమెను అద్భుతమైన మహిళా శాస్త్రవేత్తగా వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ ఫౌండేషన్‌ అభివర్ణించింది. చిన్న రైతులు సాగు చేసుకునేందుకు వీలయ్యే ప్రశస్తమైన వరి వంగడాల రూపకల్పనలో విశేషమైన కృషి చేశారని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్‌ గొర్రెజాతులకు ఎన్‌బిఏజిఆర్‌ గుర్తింపు
నాటు గొర్రెలుగా ముద్ర పడిన నాగావళి మాచర్ల ప్రాంతాల గొర్రె జాతులకు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం కృషితో నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ యానిమల్‌ జెనెటిక్‌ రిసోర్సెస్‌ (ఎన్‌బిఏజిఆర్‌) గుర్తింపు లభించింది. ఇప్పటి వరకు నెల్లూరు జాతి గొర్రెలకు మాత్రమే గుర్తింపు లభించింది. శ్రీ వెంకటేశ్వర పశు వైవ్య విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఉన్న మాచర్ల, గరివిడి పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు పదిహేనేండ్ల పాటు లోతైన అధ్యయనం చేసి శాస్త్రీయ ఆధారాలతో నివేదిక సమర్పించాయి, నాగావళి గొర్రెలను కళింగుల కాలంలో యుద్ధాలు, పందేలకు వినియోగించేవారని చెబుతారు.
జీ – 20 లో అరకు కాఫీ
అరకు కాఫీ ఖ్యాతి దేశ, విదేశాలకు వ్యాపించింది. న్యూఢిల్లీలో జరిగిన జీ – 20 సమ్మిట్‌ ఇందుకు వేదికగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ పెవిలియన్‌లో గిరిజన సహకా సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో అరకు వ్యాలీ కాఫీని ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్‌లో గిరిజన రైతులు పండించిన ప్రత్యేకమైన, అధిక నాణ్యతా ప్రమాణాలు కలిగిన కాఫీని ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన వేదికగా అందించింది. ఈ కాఫీ జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులు దృష్టిని ఆకర్షించింది.
2023కి భారతదేశంలో ఉత్తమ పర్యాటక గ్రామం బిశ్వనాథ్‌ ఘాట్‌
అస్సాంలోని బిశ్వనాథ్‌ ఘాట్‌ను 2023 ఏడాదికిగానూ బెస్ట్‌ టూరిజం విలేజ్‌ ఆఫ్‌ ఇండియాగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన 791 దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ఈ గుర్తింపు లభించింది. అస్సాం ముఖ్యమంత్రి బిశ్వ శర్మ ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేసిన అపారమైన ప్రయత్నాలుగా ఆయన అభివర్ణించారు.
– కె. నాగార్జున
కరెంట్‌ ఎఫైర్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ
9490352545

Spread the love