పార్టీ ఫిరాయింపు చట్టానికి గల మరొక పేరు?

Another name for Party Defection Act?1. భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చినవారు?
1. కెటి షా 2. గోపాలస్వామి అయ్యంగార్‌
3. హెచ్‌.వి. కామత్‌ 4.అంబేద్కర్‌
2. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి?
1. అత్యధిక కాలం పట్టిన రాజ్యాంగం ఆస్ట్రేలియా రాజ్యాంగం.
2. అతి పెద్ద రాజ్యాంగం – భారత రాజ్యాంగం
3. అతి చిన్న రాజ్యాంగం – చైనా రాజ్యాంగం.
4. పై అన్నీ
3. క్రింది వాటిలో సరైనది గుర్తించండి.
1. ప్రస్తుతం ప్రాచీన హోదా ఉన్న భాషలు ఆరు.
2. జాతీయ హిందీ దినోత్సవాన్ని సెప్టెంబరు 14న జరుపుకుంటారు.
3. ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జనవరి 10న జరుపుకుంటారు.
4. పైవన్నీ
4. పార్టీ ఫిరాయింపు గల మరొక పేరు/ పేర్లు.
ఎ. వాకా జంపింగ్‌ 2. ఫ్లోర్‌ క్రాసింగ్‌ సి. పార్టీ హాపింగ్‌
1. బి,సి 2. ఎ,బి 3. ఎ,సి 4. ఎ,బి,సి
5. తెలుగు భాష ఏ సం.లో ప్రాచీన భాష హోదాను పొందింది?
1. 2008 2. 2005
3. 2014 4. 2013
6.పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం క్రింది ఏ సందర్భాల్లో సభ్యులు సభ్యత్వాన్ని కోల్పోతారు.
ఎ. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా సభలో తన ఓటు హక్కును వినియోగించుకున్నపుడు
బి. ఒక పార్టీకి చెందిన 2/3 వంతు మంది ప్రజాప్రతినిధులు ఇతర
పార్టీలో విలీనం అయినపుడు
1. ఎ,బి 2. ఎ మాత్రమే
3. బి మాత్రమే 4. ఏది కాదు.
7. జతపరుచుము.
భాష ప్రాచీన హోదా పొందిన సం.
ఎ. సంస్కృతం 1. 2008
బి. ఒడియా 2. 2013
సి. మళయాళం 3. 2014
డి. కన్నడ 4. 2005
1.ఎ1,బి2,సి3,డి4 2. ఎ4,బి3,సి2,డి1
3.ఎ4,బి2,సి3,డి1 4. ఎ3,బి2,సి1,డి4
8. రాష్ట్రపతిని తొలగించే విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు?
1. బ్రిటిష్‌ రాజ్యాంగం 2. అమెరికా రాజ్యాంగం
3. కెనడా రాజ్యాంగం 4. ఐర్లాండ్‌ రాజ్యాంగం
9. భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్‌ దేని గురించి పేర్కొంటుంది?
1.అస్సాం,మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ జాతుల పరిపాలన వివరాలు.
2. భారతదేశంలో షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ జాతుల పరిపాలన వివరాలు.
3. అస్సాం,మేఘాలయ, మిజోరాం త్రిపుర రాష్ట్రాల్లో షెడ్యూల్‌ తెగల పరిపాలన వివరాలు.
4. ఏది కాదు.
10. సమీకృత న్యాయ వ్యవస్థ అనే అంశం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు?
1. జపాన్‌ 2. జర్మనీ
3. కెనడా 4. బ్రిటిష్‌
11. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి.
1.కొత్త రాష్ట్రాల విలీనం ఏర్పాటు – సాధారణ మెజార్టి పద్దతి.
2. ప్రాథమిక హక్కులు – ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి.
3. నియోజక వర్గాల పునర్‌ వ్యవస్థీకరణ – ఏకపక్ష మెజార్టీ పద్ధతి.
4. 1 మరియు 2
12. రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది విశిష్ట వ్యక్తులను నామినేట్‌ చేసే విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు?
1. ఆస్ట్రేలియా 2. ఐర్లాండ్‌
3. ఫ్రెంచి 4. నార్వే
13. జతపరుచుము.
భాగము అంశము
ఎ. 18వ భాగం 1. నానావిధ అంశములు
బి. 8వ భాగం 2. అత్యవసర నిబంధనలు
సి. 19వ భాగం 3. కేంద్ర పాలిత ప్రాంతాలు
డి. 13వ భాగం 4. అంతరాష్ట్రీయ వర్తక వాణిజ్యాలు
1.ఎ2,బి3,సి1,డి4 2. ఎ1,బి2,సి3,డి4
3.ఎ2,బి1,సి3,డి4 4. ఎ4,బి3,సి1,డి2
14. క్రింది వాటిలో సరియగు అంశం / అంశాలు ఏవి?
ఎ. అవశిష్ట అధికారాలు కెనడా రాజ్యాంగం నుండి స్వీకరించారు.
బి. చట్టం మూలాన సమాన రక్షణ అమెరికా రాజ్యాంగం నుండి
స్వీకరించారు.
సి. క్యాబినేట్‌ తరహా విధానం బ్రిటిషు రాజ్యాంగం నుండి
స్వీకరించారు.
డి. సమాఖ్య నమూనా అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించారు.
1.ఎ,బి,సి 2. బి,సి,డి
3. ఎ,బి,సి,డి 4. ఎ,డి
15. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసే పద్ధతిని ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు?
1. జర్మనీ 2. జపాన్‌
3. దక్షిణాఫ్రికా 4. కెనడా
16. క్రింది వాటిలో సరికానివి గుర్తించండి.
1. నియోజక వర్గాల పునర్‌ వ్యవస్థీకరణ – ఆర్టికల్‌ 83
2. పార్లమెంటులో కోరం నిర్ణయించడం – ఆర్టికల్‌ 100(3)
3. సభాహక్కులు – ఆర్టికల్‌ 105
4. పైవన్నీ
17. తాత్కాలిక సభాధ్యక్షులు నియామకం అనే అంశం ఏదేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు?
1. నార్వే 2. దక్షిణాఫ్రికా
3. ఫ్రెంచి 4. ఆస్ట్రేలియా
18. భారత రాజ్యాంగం లోని ఏ భాగము షెడ్యూల్‌ మరియు ఆదివాసి ప్రాంతాల గురించి తెలియజేస్తుంది?
1. 11 2. 10
3. 12 4.9
19. భారత రాజ్యాంగంలో సహకార సంఘాల గురించి తెలియజేసే ఆర్టికల్స్‌ ఏవి?
1.243(ఓన) – 243 (ఓు) 2. 244 – 244 (ఎ)
3. 243 (పి) – 243 (ఓ+) 4. 264 – 300 (ఎ)
20. జతపరుచుము.
ఎ. కేంద్ర పాలిత ప్రాంతాలు 1. 343-351
బి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు 2. 245-263
సి.అంతర్జాతీయ వర్తక వాణిజ్యాలు 3. 239-242
డి. అధికార భాష 4. 301- 307
1.ఎ1,బి2,సి3,డి4 2. ఎ3,బి2,సి4,డి1
3.ఎ3,బి2,సి1,డి4 4. ఎ4,బి2,సి3,డి1
21. రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహా పొందే విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు?
1. నార్వే 2. దక్షిణాఫ్రికా
3. కెనడా 4. అమెరికా
22. భారత రాజ్యాంగమును సాధారణ పరిస్థితుల్లో అది సమాఖ్యగాను అసాధారణ పరిస్థితుల్లో అది ఏక కేంద్రంగాను పని చేస్తుందని పేర్కొన్నవారు?
1. మోరిస్‌ జోన్స్‌ 2. అంబేద్కర్‌
3. గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌ 4. కేసివేర్‌
23. అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1. ఆగష్ట్‌ 29 2. ఫిబ్రవరి 21
3. సెప్టెంబరు 10 4. ఆగష్ట్‌ 29
24. క్రింది వాటిలో సరైన అంశం / అంశాలు గుర్తించండి.
ఎ. రాజ్యాంగప్రవేశికలోని స్వేచ్చ, సమానత్వం, సౌభాతృత్వం, అనే భావనలు ఫ్రెంచి రాజ్యాంగం నుండి స్వీకరించారు.
బి. రాజ్యాంగ ప్రవేశికలోని సాంఘిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం
అనే భావన రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించారు.
1.ఎ,బి 2. ఎ 3. బి 4. ఏది కాదు.
25. జతపరుచుము.
అంశం దేశ రాజ్యాంగం
ఎ. సంయుక్త సమావేశం 1. బ్రిటిషు రాజ్యాంగం
బి. గవర్నర్‌ నియామకం 2. ఆస్ట్రేలియా రాజ్యాంగం
సి. రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల 3. అమెరికా రాజ్యాంగం
ప్రాతినిధ్యం
డి. శాసన నిర్మాణ ప్రక్రియ 4. కెనడా రాజ్యాంగం
1.ఎ1,బి4,సి3,డి2 2. ఎ2,బి4,సి4,డి3
3.ఎ1 ,బి2,సి3,డి4 4. ఎ2,బి4,సి3,డి1
సమాధానాలు
1.3 2.3 3.4 4.4 5.1 6.2 7.2 8.2 9.2 10.4 11.4 12.2 13.1 14.1 15.1 16.1 17.3 18.2 19.1 20.2 21.3 22.2 23.2 24.1 25.4
డాక్టర్‌ అలీ సార్‌, 9494228002
భారత రాజ్యాంగ నిపుణులు 

Spread the love