కార్య నిర్వహక మండలిలో న్యాయసభ్యుడిగా చేరిన తొలి భారతీయుడు

He was the first Indian to join the executive council as a judge1.1773 చట్టం ప్రకారం బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌కు సహాయసహకారాలు అందించడానికి కొంత మంది సభ్యులతో కూడిన కార్యనిర్వహక మండలిని ఏర్పాటు చేశారు. అయితే క్రింది వాటిలో మండలి సభ్యులను గుర్తించండి.
ఎ. బార్‌వెల్‌ బి. చాంబర్లిన్‌
సి. క్లావరింగ్‌ డి. ఫిలివ్‌ ప్రాన్సిస్‌
1. బి,ఎ,డి 2. ఎ,సి,డి
3. సి,డి,బి 4. ఎ,బి,సి,డి
2. క్రింది ఏ చట్టం ప్రకారం భారతదేశంలో వ్యాపారం చేసే ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేసి కేవలం పరిపాలన సంస్థగా మార్చారు.
1. 1858 చార్టర్‌ చట్టం 2. 1883 చార్టర్‌ చట్టం
3. 1813 చార్టర్‌ చట్టం 4. పై ఏది కాదు.
3. 1861 భారత కౌన్సిల్‌ చట్టం ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో వైశ్రారుకి ఆర్డినెన్సులు జారీ చేసే అధికారం కల్పించారు. అయితే ఈ ఆర్డినెన్సుల కాల పరిమితి ఎంత?
1. 1 నెల 2. 14 రోజులు
3. 6 నెలలు 4. 3 నెలలు
3. భారతదేశంలో క్రింది ఏ చట్టం ద్వారా పరోక్ష ఎన్నిక ప్రవేశపెట్టారు?
1. 1909 కౌన్సిల్‌ చట్టం
2. 1935 భారత ప్రభుత్వ చట్టం
3. 1892 కౌన్సిల్‌ చట్టం
4. 1919 భారత ప్రభుత్వ చట్టం
5.క్రింది ఏ చట్టం ప్రకారం భారతదేశంలో తొలిసారిగా రాష్ట్రములకు స్వతంత్య్ర ప్రతిపత్తిని అందించారు?
1. 1935 భారత ప్రభుత్వ చట్టం
2. 1919 భారత ప్రభుత్వ చట్టం
3. 1947 భారత ప్రభుత్వ చట్టం
4. 1858 భారత ప్రభుత్వ చట్టం
6. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం క్రింది వాక్యాలను పరిశీలించుము.
ఎ. రాష్ట్రములలో ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టారు.
బి. కేంద్ర బడ్జెట్‌ నుండి రాష్ట్ర బడ్జెట్‌ ను వేరు చేశారు.
సి. కేంద్రంలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టారు.
డి. భారత రాజ్యాంగానికి నకలు / మాతృక అంటారు.
పై వాక్యాలలో సరైనది / సరైనవి గుర్తించండి.
1. ఎ,బి,సి 2. బి,సి,డి
3. ఎ,సి,డి 4. ఎ,బి,సి,డి
7. 1813 చార్టర్‌ చట్టం సంబంధించి క్రింది వాక్యాలలో సరైనది గుర్తించండి.
1. క్రిష్టియన్‌ మిషనరీల రాకను ఆహ్వానించింది.
2. విద్యా వ్యాప్తికి సం.నకు ఒక లక్ష రూ. కేటాయించారు.
3. 1,2 4. ఏది కాదు.
8. బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ అనే పదవిని రద్దు చేసి ఆ పదవీ స్థానంలో ‘భారతదేశ గవర్నర్‌ జనరల్‌’ అనే పదవిని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు?
1. 1833 చార్టర్‌ చట్టం 2. 1773 రెగ్యులేటింగ్‌ చట్టం
3. 1813 చార్టర్‌ చట్టం 4. 1853 చార్టర్‌ చట్టం
9.స్వతంత్ర భారతదేశానికి మొదటి లా కమీషన్‌ చైర్మన్‌ ఎవరు?
1. గజేంద్ర గట్కర్‌ 2. యం.సి.సెటల్వాడ్‌
3. జె.ఎల్‌. కపూర్‌ 4. లార్డ్‌ మెకాలే
10. భారత ప్రభుత్వ చట్టం 1935 అనేది బానిసత్వానికి నూతన పత్రం అని విమర్శించినవారు.
1.నెహ్రూ 2. సుభాష్‌చంద్రబోస్‌
3. గాంధీ 4. జిన్నా
11. నవంబరు 26ను న్యాయ దినోత్సవానికి బదులుగా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఏ సం.లో ప్రకటించింది?
1. 2010 2. 2005
3. 2015 4. 2012
12. జతపరుచుము.
ఎ. అట్లీ ప్రకటన 1. 1946
బి. క్యాబినేట్‌ మిషన్‌ 2. 1942
సి. క్రిప్స్‌ రాయబారం 3. 1947
డి. లా కమీషన్‌ 4. 1923
1. ఎ3,బి4,సి2,డి1 2. ఎ1,బి2,సి3,డి4
3. ఎ3,బి1,సి4,డి2 4. ఎ3,బి1,సి2,డి4
13. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి.
1. దేశం స్వాతంత్య్రం పొందిన సమయంలో బ్రిటన్‌ రాజు కింగ్‌ జార్జి (4)
2. హైదరాబాదు పోలీసు చర్య ద్వారా భారత్‌లో విలీనం.
3. ట్రావెంకోర్‌ ప్లెబిసైట్‌ ద్వారా భారత్‌లో విలీనం.
4. 1 మరియు 2
14. గవర్నర్‌ జనరల్‌ కార్య నిర్వహక మండలిలో న్యాయసభ్యుడిగా చేరిన తొలి భారతీయుడు ఎవరు?
1. ఫిరోజ్‌ షా మెహతా 2. సురేంద్రనాథ్‌ బెనర్జీ
3. సత్యేంద్ర ప్రసాద్‌ సిన్హా 4. దాదాబారు నౌరోజి
15. క్రింది ఏ చట్టం ప్రకారం కేంద్ర శాసన నిర్మాణ శాఖను ఇంపీరియల్‌ లెజిస్లేచర్‌ అని పిలిచారు?
1. 1909 భారత కౌన్సిల్‌ చట్టం
2. 1919 భారత కౌన్సిల్‌ చట్టం
3. 1861 భారత కౌన్సిల్‌ చట్టం
4. 1892 భారత కౌన్సిల్‌ చట్టం
16. జతపరుచుము.
ఎ. మొదటి గవర్నర్‌ జనరల్‌ 1. వారెన్‌ హేస్టింగ్స్‌
బి. మొదటి లా కమీషన్‌ చైర్మన్‌ 2. సర్‌ చార్లెస్‌ వుడ్‌
సి. మొదటి బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ 3. విలియం బెంటింగ్‌
డి. మొదటి భారత రాజ్యకార్యదర్శి 4. లార్డ్‌ మెకాలే
1. ఎ3,బి4,సి2,డి1 2. ఎ4,బి2,సి1,డి3
3. ఎ1,బి2,సి3,డి4 4. ఎ3,బి4,సి1,డి2
17. సివిల్‌ సర్వీసెస్‌ పితామహుడు అని ఎవరిని అంటారు?
1. లార్డ్‌ మెకాలే 2. కారన్‌ వాలీస్‌
3. వారన్‌ హేస్టింగ్స్‌ 4. విలియంబెంటింగ్‌
18. క్రింది వారిలో తొలి సుప్రీంకోర్టు న్యాయమూర్తి / న్యాయమూర్తులకు గుర్తించండి.
ఎ. లెమియోస్టార్‌
బి. ఫిలిప్‌ ప్రాన్సిస్‌
సి. హైడ్‌ డి. బార్‌వెల్‌
1. బి మాత్రమే 2. ఎ మరియు డి
3. ఎ మరియు సి 4. ఎ,బి,సి,డి
19. క్రింది ఏ చట్టాన్ని మార్క్స్‌ ఏంగిల్స్‌లు భారత దేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేయబడింది అని అభివర్ణించారు?
1. 1793 చార్టర్‌ చట్టం 2. 1833 చార్టర్‌ చట్టం
3. 1853 చార్టర్‌ చట్టం 4. 1784 పిట్స్‌ ఇండియా చట్టం
20. మహిళలకు ప్రపంచంలోనే తొలిసారి ఓటు హక్కు అందించిన దేశం?
1. భారత్‌ 2. కువైట్‌
3. న్యూజిలాండ్‌ 4. సౌది అరేబియా
21. క్రింది వాటిలో సరైన అంశం / అంశాలు గుర్తించండి.
ఎ. 1833 చార్టర్‌ చట్టం ప్రకారం గవర్నర్‌ జనరల్‌ సాధారణ అధికారాలు శాసన నిర్మాణ విధులు, కార్య నిర్వహక విధులుగా విభజన.
బి. భారతదేశంలో సివిల్‌ సర్వీస్‌ పితామహుడిగా సర్ధార్‌ వల్లభారు పటేల్‌ ను గాంధీ సంబోధించారు.
1. బి మాత్రమే 2. ఎ,బి
3. ఎ మాత్రమే 4. పై ఏది కాదు.
22. ఏ చట్టం ప్రకారం భారతదేశంలో తొలిసారిగా సివిల్‌ సర్వీస్‌లలో భారతీయులకు పోటీ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టారు?
1. 1833 చార్టర్‌ చట్టం
2. 1947 చార్టర్‌ చట్టం
3. 1853 చార్టర్‌ చట్టం
4. 1935 భారత ప్రభుత్వ చట్టం
23. భారత ప్రభుత్వ చట్టం 1935 భూస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడానికి బ్రిటిష్‌ పాలకులు ఆడిన నాటకం అని విమర్శించిన వారు?
1. గాంధీ 2. జిన్నా
3. సుభాష్‌ చంద్రబోస్‌ 4. అంబేద్కర్‌
24. అట్లీ ప్రకటన.
1.15 జులై 1947 2. 4 జులై 1947
3. 3 జనవరి 1947 4. 20 ఫిబ్రవరి 1947
25. ఏ చట్టం మహిళలకు ఓటు హక్కు కల్పించింది.
1. 1935 భారత ప్రభుత్వ చట్టం
2. 1947 భారత ప్రభుత్వ చట్టం
3. 1919 భారత ప్రభుత్వ చట్టం
4. ఏది కాదు.
సమాధానాలు
1.2 2.3 3.3 4.3 5.1 6.3 7.3 8.1 9.2 10.1 11.3 12.4 13.4 14.3 15.1
16.4 17.2 18.3 19.4 20.3 21.1 22.3 23.3 24.4 25.3

డాక్టర్‌ అలీ సార్‌, 9494228002
భారత రాజ్యాంగ నిపుణులు 

Spread the love