జీవో 142 : వైద్య ఆరోగ్య శాఖకు శాపమా, శఠగోపమా?

Geo 142 : To Medical Health Department
A curse or a curse?ప్రపంచమంతా కరోనాతో విలవి లలాడుతుంటే ప్రజలంతా ఇండ్లలో ఉంటున్నప్పుడు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యో గులు మాత్రమే బయట ప్రపంచంలోకి వెళ్లి కరోనాకు ఎదురొడ్డి పోరాడి ప్రాణాల సైతం లెక్కచేయకుండా తన విధి నిర్వహిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం హడావుడిగా 142 జీవోను తీసుకొచ్చి వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖలో అత్యున్నత ఫలితాలు రావాలంటే అందులో పనిచేస్తున్న ఉద్యోగులు శారీరకంగా, మాన సికంగా పరిపుష్టంగా కలిగి ఉండాలి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉద్యోగులు విధులు నిర్వహిస్తేనే అనుకున్న ఫలితాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పెను ప్రకంపనలను సష్టిస్తున్న హడావుడిగా తయారుచేసిన జీవో 142 వలన వైద్య ఆరోగ్యశాఖలో సుమారు నాలుగువేల ఉద్యోగాలు శాశ్వతంగా కోల్పోవలసి వస్తుంది. నాలు గువేల ఉద్యోగాలు శాశ్వతంగా కోల్పోతే జి.ఓ.77 వలన 33 ఉద్యో గాలను కొత్తగా సృష్టించారు. అవి కూడా డిప్యూటీ డైరెక్టర్‌, అసి స్టెంట్‌ డైరెక్టర్‌, సూపరిండెంటెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ లాంటి మినిస్టీరియల్‌ ఉద్యోగాలు మాత్ర మే కొత్తగా తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు సబబు? రోజురోజుకు జనాభా పెరుగు తుంది కాబట్టి జనాభా ప్రాతిపదికన ఉద్యో గాలను ఇంకా కల్పించాల్సిందే తప్ప ఉన్న ఉద్యోగాలను తీసివేసి తక్కువ ఉద్యోగులతో పని ఎక్కువగా చేయించడం అనేది సరైం దేనా? దాని వలన ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురై మానసి కంగా వేదన పడాల్సి వస్తుంది. వైద్య ఆరోగ్యశాఖ భారతదేశంలో తెలం గాణ ప్రభుత్వ ప్రసవాలలో మొట్టమొదటి స్థానాన్ని పొందింది అంటే వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల పనితనమే అందుకు నిదర్శనం.
గత ప్రభుత్వాలు వైద్య ఆరోగ్యశాఖలో పరిపాలనా సౌలభ్యం నిమిత్తం పరిపాలన వికీంద్రీకరణలో భాగంగా మొదట సెక్టార్‌ స్థాయిలో (ఎస్‌పీహెచ్‌ఓ) అనే ఆఫీసర్‌ని సృష్టించి అక్కడ ఒక కార్యాలయాన్ని ఉంచి జిల్లా స్థాయి లో డివిజన్‌ను బట్టి క్లస్టర్‌ తయారు చేయడం జరిగింది. ఈ క్లస్టర్‌ కార్యాలయాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చేసే పనులన్నీ ఇక్కడే పూర్తి చేయాలనే సదుద్దేశంతో నెల కొల్పబ డ్డాయి ఆ తర్వాత మళ్లీ మరింత సౌలభ్యం కోసం డిప్యూటీ డిఎంహెచ్‌ఓ కార్యాలయా లను ప్రారంభించి అవి కూడా డివిజన్‌కు ఒక్క అధికారి నియమించి ప్రత్యేక కార్యా లయం అందులో సిబ్బందిని అనగా ఒక (సిహెచ్‌ఓ) కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌, ఒక (హెచ్‌ ఈఓ) హెల్త్‌ ఎక్స్టెన్షన్‌ ఆఫీసర్‌, ఒక (సూపర్వైజర్‌) పర్యవేక్షకుడు/ పర్యవేక్షకురాలు, సీనియర్‌ అసిస్టెంట్‌ ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌, సబార్డినేట్‌ స్టాఫ్‌ ఉండే వారు. ఇప్పుడు ఈ 142 జీవో ప్రకారం రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కార్యాలయాలు అన్నింటిని తీసి వేయడం జరిగింది. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ అధికారులంద రినీ వివిధ కార్యక్రమాలకు ప్రాజెక్ట్‌ ఆఫీసర్లుగా లేదా ప్రోగ్రాం ఆఫీసర్లుగా నియమించాలని 142 జీవో ప్రకారం తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయిలో ఉన్న 26పిపి యూనిట్‌లను తొలగించారు. పిపి యూనిట్‌ అనగా ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం కాగానే జాతీయ టీకాల కార్యక్ర మాన్ని నిర్వహించే సిబ్బందిని పిపి యూనిట్‌ అంటారు. ఒక్కో పిపి యూనిట్‌లో పది మంది సిబ్బంది ఉంటుంది. అనగా బిడ్డ పుట్ట గానే బీసీజీ టీకా పోలియోచుక్కలు వేయవలసిన అవసరం ఉంది.
ఈ అత్యంత ముఖ్యమైనటువంటి పరినిర్వహించే పిపి యూనిట్లను ఎత్తివేయడంతో శిశువులకు ప్రాణాంతకం అవుతుం దని ప్రజలు భావిస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా 120 ఎంపీహెచ్‌ఏ.(ఎఫ్‌) సిబ్బంది, 30 ఎంపీహెచ్‌ఎస్‌(ఎఫ్‌) పోస్ట్‌లు శాశ్వతంగా ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. ఇవేకాకుండా రాష్ట్రంలో ఉన్న మలేరియా సబ్‌ యూనిట్‌ ఆఫీసులన్నింటినీ తీసివేయడం జరిగింది. జిల్లా ట్రైనింగ్‌ కార్యాలయం (మగ), జిల్లా స్థాయిలో టీబీ కార్యాలయము కుష్టు కార్యాలయంలో పనిచేస్తున్న పోస్టులు కూడా శాశ్వతంగా తొలగించారు. ఇలా123 కార్యాలయాలు రద్దు కావడంతో అందులో 1732 ఉద్యోగాలు శాశ్వతంగా కోల్పోవలసి వస్తుంది. అందులో ఆఫీస్‌ సబార్డినెట్‌ 702, ఎంఎన్‌ఓలు 227,ఎఫ్‌.ఎన్‌.ఓ 56, ఎంపీహెచ్‌ఏ(ఎం) 447, ఏపీఎంఓలు 298, డీపీఎంఓలు 69, డ్రైవర్‌లు 198, నాలుగో తరగతి ఉద్యోగులైన స్వీపర్‌ అటెండర్‌ కమిటీ నైట్‌ వాచ్మెన్‌ ఉద్యోగాలన్నీ కోల్పోవలసి వస్తుంది. 12 గంటలు పని చేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 9 పోస్టులు మాత్రమే ఉంచడం జరిగింది. అంటే అందులో ఒక వైద్యాధికారి ఒక స్టాఫ్‌ నర్స్‌ ఒక ఫార్మసిస్ట్‌ ఒక లాబ్‌ టెక్నీషియన్‌ ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఆరోగ్య విస్తరణ అధికారి లేదా ఆరోగ్య బోధకులు, పురుష పర్యవేక్షకుడు, స్త్రీ పర్యవేక్షకురాలు, ఒక పురుష ఆరోగ్య కార్యకర్త, ఒక స్త్రీ ఆరోగ్య కార్యకర్త మాత్రమే ఉంటారు. ఇక్కడ ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగమే లేదు. 24 గంటలు పని చేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 పోస్టులనిచ్చారు. అందులో ఇద్దరు వైద్యాధికారులు, ఫార్మసిస్ట్‌, స్టాఫ్‌నర్స్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ లేదా పబ్లిక్‌ హెల్త్‌ నర్స్‌, ఆరోగ్య విస్తరణ అధికారి లేదా ఆరోగ్య బోధకులు, పురుష పర్యవేక్షకులు, స్త్రీ పర్యవేక్షకులు, పురుష ఆరోగ్య కార్యకర్త, స్త్రీ ఆరోగ్య కార్యకర్త, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉంటారు.ఈ 24 గంటలు పనిచేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా ఒక నైట్‌ వాచ్మెన్‌ గాని ఒక అటెండర్‌ కానీ లేకపోవడం శోచనీయం.
ఎందుకంటే 24 గంటలు ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలలో స్థానికంగా జరిగే సాధారణ ప్రసవాలు మహిళా సిబ్బంది, మహిళలు ఉంటారు. వారికి భద్రతగా నైట్‌ వాచ్మెన్‌ ఉద్యోగం కచ్చితంగా అవ సరం. ఇలాంటి నైట్‌ వాచ్మెన్‌ ఉద్యోగం లేకుండా విధులు నిర్వ హించడం చాలా కష్టం అవుతుంది. సాధా రణంగా గ్రామీణ స్థాయిలో ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలన్నీ ఊరి చివర నిర్మించడం జరిగింది. అందువల్ల వారికి భద్రత చాలా అవసరం. లోపభూ యిష్టమైన 142 జీవోను రద్దు చేయాలని ఉద్యోగులందరూ రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతున్నారు అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తుంది. జిల్లా స్థాయిలో ప్రభుత్వ వైద్యులు, స్టాఫ్‌నర్సులు కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు, ఆరోగ్య విస్త రణ అధికారులు, ఆరోగ్య పర్యవేక్షకులు, స్టాఫ్‌ నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు (స్త్రీ, పురుషులు) సభార్డినేట్‌ సిబ్బంది, డ్రైవర్లు అందరూ ఈ పోరాటంలో పాల్గొం టున్నారు. ఇదే విధంగా నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో నిరవధిక ధర్నా నిర్వహిస్తామని జీవో 142 రద్దు పోరాట కమిటీ హెచ్చరిస్తోంది. జిల్లా స్థాయి క్షేత్రస్థాయి అధికారులను సంప్రదిం చకుండానే నాలుగు గోడల మధ్య జీవో 142ని తయారు చేసి బలవంతంగా ఉద్యోగులపై రుద్దడం సరైనది కాదు. ఈ ప్రయ త్నాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుని అందరి సల హాల మేరకు అత్యుత్తమైన నూతన జీవో విడుదల చేసి పేద ప్రజ లకు అందరికీ, ఉద్యోగులకు అనుగుణంగా ఉండే విధంగా జీవో తయారు చేసి విడుదల చేయాలని పోరాట కమిటీ కోరుతుంది.
శంకర్‌
9440747614

Spread the love