కరెంట్‌ అఫైర్స్‌

Kerala has won the Global Responsible Tourism Awardమార్స్‌ రోవర్‌ను నడిపిన మొదటి భారతీయురాలు అక్షతా కృష్ణమూర్తి
అంతరిక్ష పరిశోధనలో డాక్టర్‌ అక్షతా కృష్ణమూర్తి అపూరూపమైన విజయాన్ని సాధించారు. ఎంఏటీ (మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) నుంచి ప్రత్యేక డిగ్రీని పొందిన ఆమె ప్రయాణం మీ కలలను వదులుకోకూడదనడానికి ఒక గొప్ప ఉదాహరణ నాసాలో ఆమె చేసిన పని రోవర్‌ మిషన్‌ కోసం డాక్టర్‌ అక్షతా కృష్ణమూర్తి చేసిన కృషి చాలా ముఖ్యమైనది. ఆమె మార్స్‌పై రోవర్‌ను నడిపిన మొదటి భారతీయురాలిగా చరిత్ర కెక్కారు.

గ్లోబల్‌ రెస్పాన్సిబల్‌ టూరిజం అవార్డుని పొందిన కేరళ
టూరిజం మిషన్‌ ఆధ్వర్యంలో 2023 సంవత్సరానికి కేరళ ప్రతిష్టాత్మకమైన ”గ్లోబల్‌రెస్పాన్సిబుల్‌ టూరిజం అవార్డు” ని కైవసం చేసుకుంది. కేరళాలో అంట రానితనం దురాచారం ఎక్కవగా వున్న రోజుల్లో నారాయణగురు అనే ఆధ్యాత్మిక వేత్త స్థానికంగా ఎన్నో సంఘసంస్కరణల్ని తీసుకొచ్చాడు. విద్యా సంస్థలు నెలకొల్పాడు. అలా కేరళ రాజకీయంగానూ, ఇటు సాంస్కృతికంగానూ అభివృద్ధి చెందింది. ప్రస్తుతం గెలుపొందిన గ్లోబల్‌ రెస్పాన్సిబుల్‌ టూరిజం అవార్డును రెస్పాన్సిబుల్‌ టూరిజం పార్టనర్‌ షిప్‌, ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రెస్పాన్సిబుల్‌ టూరిజం, బెస్ట్‌ ఫర్‌ లోకల్‌ సోర్సింగ్‌, ఫుడ్‌ అండ్‌ క్రాఫ్ట్‌ విభాగం సంయుక్తంగా ఏర్పాటు చేశారు.

భారత నౌకాదళం లోనికి అతి పెద్ద సర్వే నౌక ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌
దేశంలో రూపొందించిన అతి పెద్ద సర్వే నౌక ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ 2023 డిసెంబర్‌ 4న భారత నౌకాదళంలో చేరింది. కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఈ శ్రేణిలోని 4 సర్వే నౌకల్లో ఇది మొదటిది. దీని పొడవు 110 మీటర్లు, డిసెంబర్‌ 4న నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నౌకను లాంచనంగా నేవికి అప్పగించారు. ఇది సాగరంలో హైడ్రోగ్రాఫిక్‌ సర్వేలను నిర్వహిస్తుంది.

ప్రపంచంలో అతి పెద్ద సోలార్‌ పవర్‌ ప్రాజెక్టును ప్రారంభించిన దుబాయ్‌
దుబాయ్‌ పాలకుడు మహ్మద్‌ బిన్‌ రషీద్‌ ఆల్‌ మక్తూమ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద సాంద్రీకృత సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ మహ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ ముక్తూమ్‌ సోలార్‌ పార్క్‌ నాల్గవ దశను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు 44 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి సూర్యుని కదలికను ట్రాక్‌ చేసే 70,000 హిలియో స్టాట్‌లను కలిగి వుంది. దీని ద్వారా దాదాపు 3,20,000 నివాసాలకు విద్యుత్‌ సరఫరా చేస్తూ ఏటా 1.6 మిలియన్‌ కార్బన్‌ ఉద్గారాలను తగ్గించవచ్చు.

– కె. నాగార్జున
కరెంట్‌ ఎఫైర్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ
9490352545

Spread the love