కరెంట్‌ అఫైర్స్‌

ఆర్టికల్‌370 రద్దును సమర్ధించిన సుప్రీంకోర్టు
జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హౌదాను ఉపసంహరిస్తూ 2019లో కేంద్ర ప్రభు త్వం 370 ఆర్టికల్‌ను రద్దు చేయడాన్ని సవాలుచేస్తూ దాఖలైన పలు పిటిషన్‌ల పై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరిం చింది. ఇటీవల వెలువరించిన తీర్పులో ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం అనేది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకొన్న నిర్ణయం అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆర్టికల్‌ 370 యుద్ద నేపద్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమే అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ డి.వై చంద్ర చూడ్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బెంచ్‌ తీర్పు ఇచ్చింది.
బోయిమ్‌, అవ్వాద్‌లకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి
ఇజ్రాయిల్‌-పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనడంలో కృషి సాగిస్తున్న డేనియల్‌ ఒరెన్‌ బోయిమ్‌, అలీ అబు అవ్వాద్‌లకు 2023 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి బహుమతి ప్రకటించారు. ఒరెన్‌ బోయిమ్‌ పాలస్తీనాకు చెందిన ఉద్యమకారుడు. అవ్యాద్‌ పాలస్తీనా తఘీర్‌ జాతీయ ఉద్యమ స్థాపకుడు
ఇస్రోకు ఐస్‌ల్యాండ్‌ ‘అన్వేషణ’ అవార్డు
చంద్రునిపై జీవం జాడ కోసం అన్వేషిస్తున్న ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎస్‌ఆర్‌ఓ) కు ఐస్‌ల్యాండ్‌కు చెందిన సంస్థ నుంచి అవార్డు లభించింది. చంద్రయాన్‌ -3 ద్వారా చంద్రుడిపై సాప్ట్‌ ల్యాడింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను 2023 ఏడాదికి ‘లీఫ్‌ ఎరిక్‌ సన్‌ లూనార్‌ ఫ్రైజ్‌’ను ఇస్తున్నట్టు హుసావిక్‌ నగరంలోని ఎక్స్‌ప్లోరేషన్‌ మ్యూజియం తెలిపింది.
కోవిడ్‌-19కి కొత్త వేరియంట్‌ జె.ఎన్‌.ఐ
కేరళలో కోవిడ్‌-19 సబ్‌ వేరియంట్‌ జె.ఎన్‌.ఐ కేసు బయటపడింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ప్రకటించారు. అయితే దీనిలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. కొన్ని నెలల కిందట సింగపూర్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారతీయ ప్రయాణికుల స్రీనింగ్‌ సందర్భంగా ఈ సబ్‌ వేరియంట్‌ను గుర్తించారు. దీర్ఘకాలీక వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచిస్తుంది.
33 దేశాలకు వీసా రహిత ప్రయాణాలు అనుమతిచ్చిన ఇరాక్‌
విదేశీ పర్యాటకులను, సందర్శకులను ఆకర్షించేందుకు ఇరాన్‌ ప్రభు త్వం భారత్‌ సహా 33 దేశాలకు వీసా లేని ప్రయాణాలకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది. తమ దేశానికి వీసాతో పని లేకుండా రావొచ్చంటూ ఇటీవలే మలేసియా, శ్రీలంక, వియత్నాం దేశాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
– కె. నాగార్జున
కరెంట్‌ ఎఫైర్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ
9490352545

Spread the love