సముద్రపు ఆమ్లీకరణ దృగ్విషయానికి కారణం ఏమిటి?

దృరోజురోజుకి పెరుగుతున్న కాలుష్యం వల్ల తలెత్తుతున్న పర్యావరణ సంక్షోభం ప్రపంచానికి ఒక పెను సవాల్‌గా మారింది. పర్యావరణ వ్యవస్థలు మునుపెన్నడూ లేనంత గడ్డు స్థితిని ఎదుర్కొంటున్నాయి. వాతావరణంలోకి పెద్ద ఎత్తున విడుదలవుతున్న హానికరమైన కాలుష్యకాలు సహజ ఆవరణ వ్యవస్థలతో పాటు జీవుల ఆరోగ్యంపై కూడా అనేక ప్రతికూల ప్రభావాలకు గురి చేస్తుంది. నిత్యం పర్యావరణంలోకి విడుదలవుతున్న కాలుష్య కారకాల వల్ల గాలి, నీరు, భూమి అత్యంత వేగంగా కలుషితమై పోతున్నాయి. వ్యవసాయ రంగంలో అవసరానికి మించి వినియోగిస్తున్న పురుగు మందుల వ్యర్ధాల కారణంగా భూమి తన సారాన్ని కోల్పుతుంది. పట్టణీకరణ, రవాణా, వేగవంతమైన పారిశ్రామికీకరణ, అటవీ నిర్మూలన, అధిక జనాభాతో పాటు పర్యావరణ విధానాలు సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తుంది. పర్యావరణం ఎదుర్కొంటున్న ఈ సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పర్యావరణ చట్టాలను అమలు చేయడం, పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం, వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులను మెరుగుపరచడం, పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడం, పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రజలలో అవగాహన పెంచడంతో పాటు పర్యావరణ క్షీణతను అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ ఒక్కటి కావాల్సిన తరుణమిది.
1. గ్రీన్‌హౌస్‌ ప్రభావానికి కిందివాటిలో ఏది ప్రాథమికంగా బాధ్యత వహిస్తుంది?
ఎ) నైట్రోజన్‌ బి) ఆక్సిజన్‌
సి) కార్బన్‌ డయాక్సైడ్‌ డి) హైడ్రోజన్‌
2. యాసిడ్‌ వర్షానికి కారణమేమిటి?
ఎ) నత్రజని విడుదల
బి) కార్బన్‌ మోనాక్సైడ్‌ విడుదల
సి) సల్ఫర్‌ డయాక్సైడ్‌ మరియు నైట్రోజన్‌ ఆక్సైడ్ల విడుదల డి) ఆక్సిజన్‌ విడుదల
3. ఓజోన్‌ పొర క్షీణతకు కారణమయ్యే వాయువు ఏది?
ఎ) మీథేన్‌ బి) క్లోరోఫ్లోరో కార్బన్‌లు
సి) కార్బన్‌ డై ఆక్సైడ్‌ డి) నైట్రస్‌ ఆక్సైడ్‌
4. కాడ్మియం కాలుష్యం వల్ల కలిగే వ్యాధి పేరు ఏమిటి ?
ఎ) మిన్మెటా బి) బ్లూ బేబీ
సి) బ్లాక్‌ పుట్‌ వ్యాధి డి) ఇటాయి ఇటాయి
5. గ్రేట్‌ పసిఫిక్‌ గార్బేజ్‌ ప్యాచ్‌ ప్రధానంగా దేని వల్ల ఏర్పడింది?
ఎ) మైక్రోప్లాస్టిక్స్‌ బి) సహజ వక్షసంపద
సి) సేంద్రీయ వ్యర్థాలు డి) రసాయన వ్యర్థాలు
6. కింది వాటిలో ఏది మానవ కార్యకలాపాల ఫలితంగా ఏర్పడే వాతావరణ నమూనాలలో మార్పులని సూచిస్తుంది ?
ఎ) ఎల్‌ నినో బి) సూర్యగ్రహణం
సి) చంద్ర చక్రం డి) విషువత్తు
7. నగరాల్లో వాయు కాలుష్యానికి ఈ కింది వాటిలో ఏది ఎక్కువగా దోహదపడుతుంది?
ఎ) నీటి ఆవిరి బి) నైట్రోజన్‌
సి) కార్బన్‌ మోనాక్సైడ్‌ డి) ఆక్సిజన్‌
8. ఈ కింది వాటిలో ఎడారీకరణకు ప్రధాన కారణం ఏమిటి?
ఎ) అధిక వర్షపాతం
బి) అతిగా మేత మరియు అటవీ నిర్మూలన
సి) పట్టణీకరణ డి) అగ్నిపర్వత విస్ఫోటనం
9. ఈ కింది వాటిలో సముద్ర మట్టాలు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి?
ఎ) భూమి యొక్క భ్రమణం
బి) ధ్రువ మంచు గడ్డలు వేగంగా కరగటం
సి) సౌర వికిరణం డి) సముద్ర ప్రవాహాలు
10. ఈ కింది వాటిలో పొగమంచు ఏర్పడటానికి కారణమైన ప్రధాన కాలుష్యకం ఏది?
ఎ) ఆక్సిజన్‌ బి) నైట్రోజన్‌
సి) కార్బన్‌ డయాక్సైడ్‌ డి) సల్ఫర్‌ డయాక్సైడ్‌
11. యూట్రోఫికేషన్‌ ప్రధానంగా దేని వల్ల కలుగుతుంది?
ఎ) భారీ లోహాల విడుదల
బి) నీటి వనరులలో అధిక పోషకాలు
సి) చమురు చిందటం డి) యాసిడ్‌ వర్షం
12. వాతావరణం వేడిని బంధించడం వల్ల భూమి ఉపరి తలం వేడెక్కడానికి కారణమయ్యే దగ్విషయం ఏది?
ఎ) గ్లోబల్‌ కూలింగ్‌
బి) గ్లోబల్‌ డిమ్మింగ్‌
సి) గ్లోబల్‌ వార్మింగ్‌
డి) మంచు యుగం
13. ఈ క్రింది వాటిలో రేడియోధార్మిక పదార్థాల వల్ల ఏర్పడే మానవ నిర్మిత పర్యావరణ విపత్తు ఏది?
ఎ) చెర్నోబిల్‌ విపత్తు బి) ఎల్‌ నినో
సి) యాసిడ్‌ వర్షం
డి) కొండచరియలు విరిగిపడటం
14. పగడపు దిబ్బల వినాశనానికి ప్రధాన కారణమేమిటి?
ఎ) నేల కోత
బి) ఓవర్‌ ఫిషింగ్‌ మరియు కాలుష్యం
సి) అధిక వర్షపాతం డి) అగ్నిపర్వత కార్యకలాపాలు
15. ఈ కింది వాటిలో ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధులను కలిగించే కాలుష్య కారకం ఏది?
ఎ) కార్బన్‌ డయాక్సైడ్‌ బి) ఓజోన్‌
సి) నైట్రోజన్‌ డి) ఆక్సిజన్‌
16. ఈ కింది వాటిలో జీవవైవిధ్య వినాశనానికి ప్రధాన కారణం ఏమిటి?
ఎ) గ్లోబల్‌ వార్మింగ్‌
బి) అటవీ ఆవాసాల విధ్వంసం
సి) యాసిడ్‌ వర్షం డి) భూకంపం
17. ఏ విపత్తు వల్ల సముద్ర మట్టంలో ఆకస్మిక, శక్తివంత మైన మరియు దీర్ఘకాల మార్పులు కలుగుతాయి ?
ఎ) సునామీ బి) వరద
సి) సుడిగాలి డి) హరికేన్‌
18. ఈ కింది వాటిలో ఏది ఎక్కువగా పాదరసం కాలుష్యాన్ని కలిగిస్తుంది ?
ఎ) వ్యవసాయ ప్రవాహం బి) పారిశ్రామిక ఉద్గారాలు
సి) బొగ్గు దహనం డి) చమురు చిందటం
19. నీటి అడుగున భూకంపం లేదా అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా సంభవించే విపత్తు ఏది ?
ఎ) హరికేన్‌ బి) వరద
సి) హిమపాతం డి) సునామీ
20. మిన్‌మేటా అనే వ్యాధిని కలిగించే కాలుష్యకం ఏమిటి?
ఎ) కాడ్మియం బి) ఆర్సెనిక్‌
సి) మెర్క్యూరీ డి) లేడ్‌
21. ఈ కింది వాటిలో సముద్రపు ఆమ్లీక రణ దగ్విషయానికి కారణం ఏమిటి ?
ఎ) సల్ఫర్‌ డయాక్సైడ్‌ విడుదల
బి) అటవీ నిర్మూలన
సి) కార్బన్‌ డయాక్సైడ్‌ శోషణ
డి) నైట్రోజన్‌ ఆక్సైడ్ల శోషణ
22. ఈ-వేస్ట్‌ ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్‌ ఎన్నో స్థానంలో ఉంది?
ఎ) 12వ స్థానం బి) 8వ స్థానం
సి) 5వ స్థానం డి) 10వ స్థానం
23. ఈ కింది వాటిలో నీటిని శుభ్రం చేయడానికి దేనిని వినియోగిస్తారు ?
ఎ) హీలియం బి) క్లోరిన్‌
సి) ఫ్లోరిన్‌ డి) బొగ్గు పులుసు వాయువు
24. సెల్‌ఫోన్‌ వ్యర్థాలలో అధికంగా ఉండే లోహం ఏమిటి?
ఎ) కోబాల్ట్‌ బి) నికెల్‌
సి) పెల్లాడియం డి) సిల్వర్‌
25. ఒజోన్‌ పొర క్షీణతను ఈ సంవత్సరంలో గుర్తించారు?
ఎ) 1885 బి) 1985
సి) 1989 డి) 1998
సమాధానాలు
1. సి 2. సి 3. బి 4. డి 5. ఎ
6. ఎ 7. సి 8. బి 9. బి 10. సి
11. బి 12. సి 13. ఎ 14. బి 15. బి
16. బి 17. ఎ 18. సి 19. డి 20. సి
21. సి 22. సి 23. బి 24. సి 25. బి
డాక్టర్‌ కె. శశిధర్‌
పర్యావరణ నిపుణులు
94919 91918 

Spread the love