26న డాక్‌ అదాలత్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పోస్టల్‌ సేవలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఈనెల 26వ తేదీ వర్చువల్‌ పద్ధతిలో రాష్ట్ర స్థాయి డాక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్టు పోస్టల్‌ సర్వీసెస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎన్‌ రంగారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల సర్వీసు అంశాలు, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు ఈ అదాలత్‌లో స్వీకరించ బడవని స్పష్టం చేశారు. పోస్టల్‌ సేవలకు సంబంధించిన ఫిర్యాదుల్ని రాతపూర్వకంగా చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌, తెలంగాణ సర్కిల్‌, హైదరాబాద్‌-500001 చిరునామాకు పంపాలని తెలిపారు. ఫిర్యాదు దారులు తప్పనిసరిగా ఫోన్‌ నెంబర్‌ లేదా ఈ-మెయిల్‌ ఐడీని రాయాలనీ, డాక్‌ అదాలత్‌ వర్చువల్‌ లింక్‌ను దానికి పంపుతామని వివరించారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని, మరింత మెరుగైన పోస్టల్‌ సేవలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నేడు పోస్టల్‌ సేవలపై అవగాహన సదస్సు
తపాలాశాఖ పొదుపు పథకాలు, బీమా, ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌బ్యాంక్‌ అందించే సేవలపై బుధవారం సనత్‌నగర్‌లోని హిందూ మహిళా కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్‌ సిటీ డివిజన్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఏ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజియన్‌ జనరల్‌ హెడ్‌ క్వార్టర్స్‌ పోస్ట్‌మాస్టర్‌ టీఎమ్‌ శ్రీలత, హిందూ మహిళా కళాశాల కార్యదర్శి డాక్టర్‌ హెచ్‌ఎమ్‌ త్రిపాఠి పాల్గొంటా రని వివరించారు. ఆసక్తి ఉన్న ప్రజలు ఈ సదస్సులో పాల్గొని, పోస్టల్‌ సేవల్ని తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love