హైదరాబాద్ గాంధీ భవన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ రక్షణ దీక్షలో భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం రాష్ట్ర చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతమ్ కు పూలమాల వేసి దీక్ష ప్రారంభించినట్లుగా భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం జిల్లా చైర్మన్ దండు రమేష్ తెలిపారు.