గణిత విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న దత్తు

నవతెలంగాణ – మద్నూర్
నూతనంగా ఏర్పడ్డ డోంగ్లి మండలంలోని మొఘ గ్రామానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. హాళ్లే దత్తు ఐఐఐటీ బాసర లో గణిత విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తో పాటు అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ గా ఉత్తమ సేవలు అందించినందుకు వైస్ ఛాన్సలర్ అవార్డు అందుకున్నందుకుగాను గ్రామస్తులు అభినందించారు. ప్రస్తుతం డా. దత్తు ఐఐఐటీ బాసర లో అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ మరియు అడ్మిషన్ కో -కోఆర్డినేటర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్రిబుల్ ఐటీ లో విధులు నిర్వహిస్తూ ఉత్తమ అవార్డులు అందుకోవడం మోగా గ్రామాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లడం ఆ గ్రామ ప్రజలు అతనికి అభినందిస్తున్నారు త్రిబుల్ ఐటీలో విధులు నిర్వర్తిస్తూ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సాధించడం ఉమ్మడి మద్నూర్ మండలానికి గర్వ కారణమని మండల ప్రజలు డాక్టర్ దత్తుకు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Spread the love