కాంగ్రెస్‌లోకి డీసీసీబీ చైర్మెన్‌ కొత్తకుర్మ సత్తయ్య

నవతెలంగాణ-తుర్కయంజాల్‌
తుర్కయంజాల్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో భారీ షాక్‌ తగిలింది. తుర్కయంజాల్‌ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ పార్టీలో బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న డీసీసీబీ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య బీఆర్‌ఎస్‌ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, తాండూర్‌ ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డిలు ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తెలంగాణ అభివద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని నమ్మి బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీ తీర్ధం పుచ్చుకుంటుంన్నారని పేర్కొన్నారు. మధ్యాహ్నం సీఎం రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్క రించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్తకుర్మ మం గమ్మ శివకుమర్‌, నోముల కష్ణ గౌడ్‌, గుండ్లపల్లి ధన రాజ్‌, కోసిక ఐలయ్య, పుల్లగుర్రం విజయానంద్‌ రెడ్డి, గుండా ధన్‌ రాజ్‌, రెవల్లే యాదగిరి, మేతరి దర్శన్‌, సుజాత అలీ, తాడిచెట్టు అశోక్‌ గౌడ్‌, సామ భీమ్‌ రెడ్డి, బారు శ్రీనివాస రావు(బొగ్గు శ్రీను), కొల్లూరి నిరంజన్‌ రెడ్డి, మేతరి శంకర్‌, చేగురి వెంకటేష్‌ పాల్గొన్నారు.

Spread the love