– రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు..
నవతెలంగాణ – వేములవాడ
రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు, రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి నీ వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ లో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశానికి రాజీవ్ గాంధీ ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, నాయకులు చిలుక రమేష్, పీర్ మహమ్మద్, దాడి మల్లేశం, కొలకని రాజు, పులి రాంబాబు, ముప్పిడి శ్రీధర్, అక్క న పెళ్లి నరేష్, నాగుల మహేష్, దుర్గం పరశురాం గౌడ్, అరుణ్ తేజ చారీ, వస్తాదు కృష్ణ ప్రసాద్ గౌడ్, కొక్కుల బాలకృష్ణ, నాంపల్లి శ్రీనివాస్, తాళ్లపల్లి నాగరాజు, సాబీర్, రాజు తోపాటు తదితరులు పాల్గొన్నారు.