అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతినవతెలంగాణ-మియాపూర్‌
ఓయో రూమ్‌లోని ఆరో అంతస్తు నుంచి దూకి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది. మాదాపూర్‌ సీఐ జి.మల్లేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన సాయి (30) నగరంలో ఉంటూ సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు. ఇటీవల ప్రిలిమ్స్‌ పరీక్ష రాసి మెయిన్స్‌కు సిద్ధం అవుతున్నాడు. ఆదివారం నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని ఓయో రూమ్‌కి వెళ్లాడు. అయితే అర్ధరాత్రి ఓయో హౌటల్‌ ఆరో అంతస్తుపై నుంచి దూకి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాదాపూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. సాయి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Spread the love