ఘోర రైలు ప్రమాదం… 15కు చేరిన మృతుల సంఖ్య

నవతెలంగాణ – కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని దార్జిలింగ్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే ట్రాక్‌ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడంతో ఓ బోగీ గాల్లోకి లేచింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది ప్రయాణికులు మృతిచెందగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. అస్సాంలోని సిల్చార్‌ నుంచి కోల్‌కతాలోని సీల్దాకు బయల్దేరిన కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్‌  మధ్యలో న్యూజల్‌పాయ్‌గుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయల్దేరిన కాసేపటికే రంగపాని స్టేషన్‌ సమీపంలో వెనక నుంచి ఓ గూడ్స్‌ రైలు దీన్ని బలంగా ఢీకొట్టింది.

Spread the love