తొలి అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ ను ప్రారంభించిన ప్రధానమంత్రి

నవతెలంగాణ కోల్‌కతా: భారత్‌లో తొలిసారిగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులు పెట్టింది. పశ్చిమబెంగాల్‌(west bengal) రాజధాని కోల్‌కతా (Kolkata)లో నిర్మించిన తొలి అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ మార్గాన్ని (underwater metro section) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) బుధవారం ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అందులో ప్రయాణించారు. కోల్‌కతా ఈస్ట్‌ – వెస్ట్‌ మెట్రో కారిడార్‌ కింద దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారు. కోల్‌కతా ఈస్ట్‌ – వెస్ట్‌ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా.. 10.8 కి.మీ. భూగర్భంలో ఉంటుంది. ఇందులో హావ్‌డా మైదాన్‌ నుంచి ఎస్‌ప్లెనెడ్‌ స్టేషన్ల మధ్య 4.8 కి.మీ.ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని 45 సెకన్లలో దాటే మెట్రోరైలు కోల్‌కతా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. సొరంగం అంతర్గత వ్యాసం 5.5 మీటర్లు కాగా, బాహ్య వ్యాసం 6.1 మీటర్లు. నదీగర్భానికి 16 మీటర్ల దిగువన, భూమి లోపలికి 32 మీటర్ల లోతులో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం హావ్‌డా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్ఠంగా 90 నిమిషాల సమయం పడుతోంది. అండర్‌వాటర్‌ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గనుంది.

Spread the love