ఘోర ప్రమాదం… 25మంది సజీవదహనం

నవతెలంగాణ పుణె: మహారాష్ట్రలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరింది. బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 32 మంది ప్రయాణికులతో యావత్మాల్​నుంచి పుణెకు వెళ్తుండగా శనివారం 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు ధాటికి బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. క్షతగాత్రులను బుల్దానా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు స్థానిక అధికారులు తెలిపారు.

Spread the love