ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ చట్ట సాధనకు.. 4న చలో ఢిల్లీ

– డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్
నవతెలంగాణ మిరు దొడ్డి 
 దేశ వ్యాప్తంగా ఎస్సీ,ఎస్టి సబ్ ప్లాన్ చట్టం చేయాలని,భారత రాజ్యాంగ స్థానంలో మను అధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తున్న బీజేపీ విధానాలను నిరసిస్తూ, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపుతో డిసెంబరు 4 న జరిగే చలో డీల్లీకి దళితులందరూ తరలిరావాలని  దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్)  జాతీయ కార్యదర్శి పి.శంకర్ పిలుపునిచ్చారు. అనంతరం చలో ఢిల్లీ పొస్టర్ ను లింగుపల్లిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద పెద్ద ఎత్తున దాడులు దౌర్జన్యాలు పెరిగాయని అన్నారు. బాధితులకు రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వం దాడులు దౌర్జన్యాలకు తెగబడుతున్న పెత్తందారులకు కొమ్ముకాస్తున్నదని  అన్నారు.
రాజ్యాంగ హక్కులను అమలు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధపడటం లేదన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నదన్నాతు. కార్పొరేట్ బహుళజాతి కంపెనీల ఒత్తిడికి తల్లోగ్గి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ప్రభుత్వ రంగ పెట్టుబడిలను ఉపసంహరించుకోవడం చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలు చేయడం లేదు అన్నారు.ప్రైవేట్ రంగంలో  రిజర్వేషన్ల అమలు చేయకపోవడం వలన ఉన్నత విద్య చదివిన దళిత విద్యార్థులు ఉపాధికి దూరం అవుతున్నారని అన్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న భూసేకరణలో దళితుల చేతుల్లో ఉన్న అసైన్మెంట్ భూములన్ని కేంద్రీకరించి లాక్కుంటున్నారని అన్నారు.
గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పెత్తందారుల ఒత్తిడి  వలన ఉపాధి పనికి నిధులు తగ్గించి పనిని ఎత్తేయాలని కుట్ర చేస్తున్నది పట్టణాలలో ఉపాధి పని పెట్టాలని చేస్తున్న డిమాండ్ ను పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలో దళితులకు మూడు ఎకరాల భూమి పంచుతామని ప్రభుత్వం చేతులెత్తేసింది పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధపడటం లేదన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై నడిరోడ్డు మీద పెత్తందారు నరికి చంపుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అంటరాని తనం కుల వివక్షను పాలకులే పెంచి పోషిస్తున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధపడటం లేదన్నారు. దళిత బంధ పధకాన్ని ప్రచారానికి ఉపయోగించుకొని ఓట్ల ను పొందారన్నారు.జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు, మంత్రి కోనేరు రంగారావు  భూకమిటి  సిఫార్సులను అమలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి.కిరణ్, జె.బాలనర్సు, ఎల్లవ్వ, అనసూయా, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love