నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ కీ శాశ్వత వైస్ ఛాన్సలర్ ను నియమించాలని, ఈనెల 27 నా జరిగే ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ ఎఫ్ ఐ) తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో న్యూ బాయ్స్ హాస్టల్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎస్ ఎఫ్ ఐ యూనివర్సిటీ అధ్యక్షులు శివ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్న ఇప్పటికి యూనివర్సిటి లకు శాశ్వత వైస్ ఛాన్సలర్ ను నియమించా కపోవడంలో ఆంతర్యం ఏమిటో అని ప్రశ్నించారు. అదే విధంగా సెర్చ్ కమిటీ జాప్యాన్ని వీడానాడి తక్షణమే రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నీ నియమించి కుంటి పడి ఉన్న యూనివర్సిటి నీ బాగు చేయాలనీ డిమాండ్ చేశారు. దానితో పాటుగా యూనివర్సిటీ రోడ్లనూ మరమత్తులు చేయాలనీ, హాస్పిటల్స్ లో కనీస సౌకర్యాలను కల్పించడం తో పాటుగా సెక్యూరిటీ గార్డులు లేకపోవడం తో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు హాస్టల్ మెస్ డిపాజిట్ ఫీజులను తగ్గించాలని పాలన యంత్రాంగన్ని కోరారు. అదే విద్యార్థుల సౌకర్యార్థం కోసం టవర్ ల ను ఏర్పాటు చేయాలని లేకపోతే భవిష్యత్తులో ఉద్యమాలనీ ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు దినేష్, యూనివర్సిటీ ఉపాధ్యక్షులు రాజు, అశోక్, తరుణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.