ఏడుగురిపై బహిష్కరణ వేటు

Deportation against seven– కాకతీయ మెడికల్‌ కాలేజీ ర్యాగింగ్‌ ఘటనలో..
– మూడు నెలలు అకాడమిక్‌ ఇయర్‌, ఏడాది హాస్టల్‌ సస్పెన్స్‌
– యాంటీ ర్యాగింగ్‌ కమిటీ నిర్ణయం
నవతెలంగాణ – మట్టెవాడ
ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం వైద్య విద్యార్థి మనోహర్‌పై ర్యాగింగ్‌ పేరుతో విచక్షణరహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు సీనియర్‌ వైద్య విద్యార్థులపై సస్పెన్షన్‌ వేటు పడింది. కాకతీయ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ దివ్వెల మోహన్దాస్‌ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన యాంటీ ర్యాగింగ్‌ కమిటీ 4 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్‌ వైద్య విద్యార్థుల నుంచి వివరణ తీసుకొని సాక్షులను విచారించారు. ర్యాగింగ్‌ జరిగింది వాస్తవ మేనని నిర్ధారించింది. కాగా, మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్న మనోహర్‌ ఈనెల 14వ తేదీ రాత్రి కళాశాల లైబ్రరీలో చదువుకొని వెళ్తున్న క్రమంలో సీనియర్‌ వైద్య విద్యా ర్థులు పిలవగా రాకపోవడంతో ర్యాగింగ్‌ పేరుతో విచక్షణా రహితంగా అతనిపై దాడిచేశారు. గాయ పడిన విద్యార్థి పోలీసులను ఆశ్రయించడంతో సీని యర్‌ వైద్య విద్యార్థులపై కేసులు కూడా నమోదయ్యా యి. ఈ నేపథ్యంలో నాలుగు రోజులపాటు విచార ణ కొనసాగించిన కళాశాల యాంటీ ర్యాగింగ్‌ కమిటీ మంగళవారం సమావేశమై మనోహర్‌పై దాడిచేసిన సీనియర్‌ వైద్య విద్యార్థులు అభినవ్‌ మోర, సిలువేరు శ్రీహరి, శ్రీ చరణ్‌, సూర్య ప్రకాష్‌, సాయి కిరణ్‌, హరి కృష్ణ, కె.లోకేష్‌ను ఈ విద్యా సంవత్సరంలో మూడు నెలల పాటు బహిష్కరించడంతోపాటు ఏడాది పాటు హాస్టల్‌ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నది. విద్యార్ధులను బయపట్టే చర్యలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని తెలిపేందుకే ఇలాంటి నిర్ణ యంతీసుకున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. సమా వేశంలో డాక్టర్‌ రాజ్‌ కుమార్‌ రెడ్డి, యాదగిరి, వేణు గోపాల్‌, కిషన్‌, విజరు కుమార్‌, సుధాకర్‌, అనితా రెడ్డి, అనిఫ్‌ ఖాన్‌, సుజాత, రాజారామ్‌, దామోదర్‌ బారు, అపర్ణ, మధుసూదన్‌ రెడ్డితో పాటు సీనియర్‌, జూనియర్‌ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love