
నవతెలంగాణ-రెంజల్ : రెంజల్ మండలం కందకుర్తి చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు జరపగా మహారాష్ట్ర నుంచి ఒక వ్యక్తి 24 దేశదారు పార్టీలను తీసుకెళ్తుండగా వాటిని స్వాధీనం చేసుకొని అట్టి వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ శాఖ సీఐ రూప్ సింగ్ పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా మద్యం తరలించిన వారిపై కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట ఎక్సైజ్ సిబ్బంది ఉన్నారు.