– టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాల్సిన అవసరం ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. నిరంతరం ప్రజలతో మమేకమై భరోసాను పార్టీ కార్యకర్తలకు నాయకులు ఇవ్వాలని చెప్పారు. ఈ మేరకు సెప్టెంబర్ నాలుగున ఇందిరాపార్కు దగ్గర ధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు గురువారం పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, కో-ఆర్డినేటర్లు, త్రిమెన్ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఖీ పండగ పురస్కరించుకొని టీడీపీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా రాష్ట్రంలోని యావత్ మహిళా సోదరీమణులందరికీ శభాకాంక్షలు తెలిపారు.