Tuesday, August 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసంఆగస్టు ఒకటిన ధర్నా

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసంఆగస్టు ఒకటిన ధర్నా

- Advertisement -

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు ఒకటో తేదీన ధర్నా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ధర్నా వాల్ పోస్టర్‌‌ను ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, ఏబీఆర్ఎస్ఎం దక్షిణ మధ్య క్షేత్ర విద్యాలయ ప్రముఖ్ సూరం విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి దుబాషి భాస్కర్, రాష్ట్ర బాద్యులు వివిధ జిల్లాల భాద్యులు ధర్నా వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న ధర్నాలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. డీఏల ప్రకటన, పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపు, సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు తదితర డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -