Tuesday, May 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించిందా?

ఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించిందా?

- Advertisement -


కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తే 
రాజకీయ సన్యాసం తీసుకుంటా ..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌
నవతెలంగాణ-కేపీహెచ్‌‌బీ

హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇందిరమ్మ ఇల్లు అయిన నిర్మించిందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రశ్నించారు. అలా నిర్మించినట్టు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఎన్‌కేఎన్‌ఆర్ గార్డెన్స్‌లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ సర్
ప్రక్రియ సర్వేతో ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటికి అధికారులు వచ్చినప్పుడు సరైన వివరాలు ఇవ్వాలని, ప్రతి ఓటరునూ అప్రమత్తం చేయాలని చెప్పారు. ఎస్‌ఐఆర్‌కు సంబంధించి ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. “ఓటు మీ హక్కు” అని పేర్కొంటూ, ఇంటికి అధికారులు వచ్చినప్పుడు సరైన వివరాలు ఎలా ఇవ్వాలి.. ఓటు హక్కును ఎలా కాపాడుకోవాలనే అంశాలపై కార్యకర్తలు, ప్రజలకు సూచనలు చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాయకత్వంలో కార్యకర్తలు సైనికుల్లా పని చేసి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో లక్ష మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలను బీఆర్ఎస్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, వారిని ఆదుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రజల్లో ఉంటూ కష్టపడే నాయకులకే కార్పొరేటర్ టికెట్ కచ్చితంగా దక్కుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ నాయకత్వంలో, అప్పటి మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -