డబుల్ బెడ్రూం ఇండ్లు లేని
గ్రామాల్లో ఓట్లు అడగొద్దు
కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సొంత చెల్లి, బావ ఫోన్‌లు కూడా ట్యాప్ చేసిన కేటీఆర్‌కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత కూడా లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నర ఏండ్లలోనే రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ పాలన అంటే ఏంటో గ్రామాల్లోకి వెళ్లి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న కుటుంబాలను అడిగితే తెలుస్తుందని కేటీఆర్‌కు హితవు పలికారు. ఫామ్‌హౌస్‌లలో ఉంటే ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. వచ్చేనెల ఒకటిన మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారని వివరించారు. హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నామని ఈనెల23న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామని తెలిపారు. రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్న కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడగొట్టి, లోక్‌సభ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చి, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాల్లో కూడా ఓడగొట్టిన ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వీఆర్‌ఎస్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా రాజకీయ సన్యాసం తీసుకోనక్కర్లేదని తెలిపారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగబోదని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లు లేని గ్రామాల్లో బీఆర్ఎస్ ఓట్లు అడగొద్దని కేటీఆర్‌కు పొంగులేటి సవాల్ విసిరారు.
ఇందిరమ్మ పేరు పలికే అర్హత లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



